షూటింగ్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ అఖండ

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత పవర్ఫుల్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ కలిసి చేసిన సింహా, లెజండ్.. అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాగే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి అఖండ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అఖండ టీజర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో అఖండ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక అఖండ షూటింగ్ పూర్తయినట్లు ఈరోజు అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. నవంబర్ లేదా డిసెంబర్ లో అఖండ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఎస్ ఎస్ థమన్ అఖండకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.