
అసలు బాలయ్యని పూరి ఎలా చూపించబోతున్నాడంటే, ‘ఇందులో బాలయ్య మాఫియా డాన్‌గా కనిపిస్తారు’ అంటూ అసలు విషయాన్ని పూరి బయట పెట్టాడు. అయితే మాఫియా డాన్ అనగానే ‘కబాలి’లా, ‘బిజినెస్‌మేన్’లా వుంటుందని ఊహిస్తారని, గతంలో వచ్చిన మాఫియా డాన్స్ క్యారెక్టర్లకి ఇది పూర్తి భిన్నంగా వుంటుందని, ఇందులో కొత్తరకం బాలయ్యని చూస్తారని అతను చెబుతున్నాడు.
ఈ చిత్రంలో పొలిటికల్ పంచ్‌లు వుండవని, పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రమని చెప్పాడు. బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు వుంటారని, మెయిన్ హీరోయిన్‌ని ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలిపాడు. ఓకే అయిన ఇద్దరు హీరోయిన్లు కూడా కొత్తవాళ్లేనట. బాలయ్యతో సినిమా పట్ల పూరి ఎంత ఎక్సయిటెడ్‌గా వున్నాడంటే, ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రోగ్ గురించి కంటే దీని గురించే అతను ఎక్కువ మాట్లాడుతున్నాడు. తమ కాంబినేషన్‌కి వచ్చిన క్రేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని, ఫాన్స్ డిజప్పాయింట్ అవని ఒక మంచి ప్రోడక్ట్ అందిస్తానని చెప్పాడు.
Recent Random Post: