బెల్లంకొండ డబ్బుతో కొడతాడు

స్టార్‌ హీరోల పక్కన నటించే హీరోయిన్లని యువ హీరోలతో చేయమంటే అంత ఈజీగా ఒప్పుకోరు. వాళ్లు అడిగే పారితోషికానికి నిర్మాతలు కూడా బెంబేలెత్తిపోయి వారి జోలికి పోరు. కానీ కొడుకుని స్టార్‌ని చేయాలని చూస్తోన్న బెల్లంకొండ సురేష్‌ మాత్రం ఖర్చు విషయంలో రాజీ పడడు.

తనయుడి సినిమాకి ఆకర్షణ వుండాలంటే స్టార్‌ హీరోయిన్‌ వుండాల్సిందే అని అతను హీరోయిన్‌ కోసం భారీగా కేటాయిస్తాడు. సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇద్దరికీ మార్కెట్‌ రేటు కంటే యాభై శాతం ఎక్కువ ఆఫర్‌ చేసి వారి డేట్లు తీసుకున్నాడు. ఇప్పుడు పాపులర్‌ అవుతోన్న కీర్తి సురేష్‌కి పవన్‌కళ్యాణ్‌ పక్కన కూడా అవకాశం వచ్చేసరికి ఆమెని బెల్లంకొండ శ్రీనివాస్‌ తదుపరి చిత్రానికి హీరోయిన్‌గా బుక్‌ చేసుకున్నారు.

ఎడాపెడా సినిమాలతో యమ బిజీగా వున్న కీర్తి సురేష్‌కి బెల్లంకొండ ఒకేసారి ఎనిమిదంకెల పారితోషికం ఆఫర్‌ చేసాడట. ఇంతవరకు అరకోటి దాటని తనకి ఒకేసారి కోటి రూపాయలనే సరికి నో చెప్పడానికి రీజన్లు వెతుక్కోవలసి వచ్చిందట. మిగతా సినిమాల డేట్స్‌ అన్నీ అడ్జస్ట్‌ చేసి మరీ ఈ చిత్రానికి డేట్స్‌ ఇచ్చిందట.

శ్రీవాస్‌ దర్శకత్వంలో శ్రీనివాస్‌ హీరోగా రూపొందే సినిమాలో కీర్తి ఖరారైపోయింది. హీరోయిన్లని ఇలా డబ్బుల్తో కొడుతోన్న సురేష్‌ దర్శకులని కూడా డబ్బులిచ్చి కొనేస్తున్నాడు. వినాయక్‌, బోయపాటి లాంటి వాళ్లు స్టార్లని వదిలేసి శ్రీనివాస్‌తో చేసారంటే అదే కదా కిటుకు. కొడుకు కోసం సురేష్‌ పడుతోన్న తపనకి మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే.


Recent Random Post: