ఇది ఒక గేమ్‌ షో అనే విషయాన్ని మర్చిపోయారా?

బిగ్‌ బాస్‌ అంటేనే ఫుల్‌ ఆఫ్‌ ఎమోషన్స్‌ అనడంలో సందేహం లేదు. కోపం, నవ్వు, ఏడుపు, రొమాన్స్‌ ఇంకా రకరకాల ఎమోషన్స్‌ ను కంటెస్టెంట్స్‌ వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏ విధమైన ఎమోషన్స్‌ ను కనబర్చినా కూడా అది కెమెరాలో చిక్కుతుంది ప్రేక్షకులకు చేరుతుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. బయట ఉన్నప్పుడు అట్లా ఇట్లా అనుకుంటారు. కాని హౌస్‌ లోకి వెళ్లిన తర్వాత అన్‌ లిమిటెడ్‌ ఎమోషన్స్‌ ను చూపిస్తూ ఉంటారు. బిగ్‌ బాస్‌ అనేది గేమ్‌ షో అనే విషయం మర్చి పోయి ప్రతి ఒక్కరు ఎలిమినేట్‌ అయిన సమయంలో కన్నీరు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో ఆ ఎమోషన్‌ మరింత ఎక్కువ అయ్యింది. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవ్వడం ఖచ్చితంగా సోహెల్‌ కు చాలా పెద్ద విషయం. కాని సోహెల్‌ తన ఎమోషన్‌ ను దాచుకోకుండా బరస్ట్‌ అవ్వడం ఇక్కడ చర్చనీయాంశం. మెహబూబ్‌ ను ఇక జీవితంలో కలువలేక పోవచ్చు అన్నంత రీతిలో ఎమోషనల్‌ అయ్యాడు. సోహెల్‌ చిన్న పిల్లాడిగా ప్రవర్తిస్తాడు అనే విషయం అంతా అంటూ ఉంటారు. కాని బిగ్‌ బాస్‌ గేమ్‌ షో అనేది చాలా హుందాగా చాలా ఎమోషన్స్‌ ను దాచుకునే విధంగా ఉండాలి. ఎమోషన్స్‌ ను దాచుకుని ఆడటం వల్లే గేమ్‌ లో ముందుకు సాగగలరు. మెహబూబ్‌ ఎమోషన్స్‌ ను దాచుకునే ప్రయత్నం చేసినా కూడా వెళ్లి పోతున్నాను అనే బాధ అతడిని కుంద దీసింది.

కిందపడి మరీ బాదపడి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బిగ్‌బాస్‌ లో విజేత ఒక్కరే. ప్రతి ఒక్కరు విజేత అవ్వాలని కోరుకుంటారు. కాని చివరికి విజేత ఎవరు అనే విషయంలో మాత్రం ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు మెహబూబ్‌ తన జర్నీ కొనసాగించాడు. అదే చాలా పెద్ద విషయం. దేవి, కుమార్‌ సాయి, అమ్మరాజశేఖర్‌ ఇంకా పలువురు చాలా ఫేమస్‌ పర్సనాల్టీస్ ఎప్పుడో వెళ్లి పోయారు. వారితో పోల్చితే నాకు చాలా బెటర్‌ గా అభిమానులు ఓట్లు వేశారు అనుకుని సంతోషంగా వెళ్లాల్సింది పోయి మెహబూబ్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

ఇంటి సభ్యులు అందరిని కూడా మెహబూబ్‌ కన్నీరు పెట్టించాడు. ఇది ఒక గేమ్ షో ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్‌ అవ్వాలి. ఆ విషయం అంతా మర్చి పోయారా అన్నట్లుగా కన్నీరు పెట్టుకున్నారు. ఆయన ఎలిమినేట్‌ అవ్వాలంటూ నామినేట్‌ చేసిన వారు కూడా వెళ్లి పోయే ముందు కన్నీరు పెట్టుకుని తమ ఎమోషన్స్‌ ను బహిర్గతం చేశారు. అభిజిత్‌ కూడా ఎమోషనల్‌ అయ్యేలా ఉన్నా కంట్రోల్‌ చేసుకున్నాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ మరీ ఎమోషనల్‌ డ్రామా అయ్యింది.


Recent Random Post: