డీజే పాట.. మనోభావాలు దెబ్బ తిన్నాయ్

మీడియా.. సోషల్ మీడియా జోరు పెరిగాక.. జనాలు ఏ చిన్న విషయాన్నీ తేలిగ్గా తీసుకోవట్లేదు. అన్ని విషయాల మీదా స్పందిస్తున్నారు. ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా గళం విప్పుతున్నారు. ఫిల్మ్ మేకర్స్.. ఏ చిన్న తప్పటడుగు వేసినా.. అది మీడియాలో దాని గురించి పెద్ద చర్చ నడుస్తోంది.

చిన్న విషయం కూడా పెద్ద వివాదమై కూర్చుంటోంది. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ ప్రోమోస్ చూస్తే బ్రాహ్మణుడైన హీరో పాత్ర విషయంలో ఏదో ఒక వివాదం తలెత్తుతుందని ముందు నుంచి డౌట్లు కొడుతున్నాయి. ఇప్పుడు అనుకున్నట్లుగానే ‘డీజే’కు సంబంధించి ఓ వివాదం మొదలైంది.

ఇటీవలే విడుదలైన ‘డీజే’ ప్రోమో సాంగ్ మీద వివాదం చెలరేగుతోంది. ‘గుడిలో బడిలో మదిలో..’ అంటూ సాగే పాట మీద బ్రాహ్మణ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రుద్ర స్త్రోత్రాన్ని సినిమా కోసం ఖూనీ చేశారని ఈ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ‘నమకం’.. ‘చెమకం’ అంటూ ఈ స్తోత్రంలోకి కొత్త పదాలు తీసుకొచ్చి.. దీన్ని డ్యూయెట్ లాగా మార్చడం.. పవిత్రమైన స్తోత్రాన్ని డ్యూయెట్ కోసం ఉపయోగించడం.. స్టెప్పులేయించడంపై అభ్యంతరం చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారుల్ని కలిసి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాయి. గతంలో ‘అదుర్స్’.. ‘దేనికైనా రెడీ’ లాంటి సినిమాల్లో బ్రాహ్మణుల మనోభావాల్ని దెబ్బ తీసేలా సన్నివేశాలున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం కావడం.. ‘దేనికైనా రెడీ’ సినిమా విషయంలో పెద్ద గొడవ జరగడం తెలిసిందే.


Recent Random Post: