
కేథరిన్ థ్రెసా టాలీవుడ్లోకి అరంగేట్రం చేసి చాలా ఏళ్లే అయింది. ఐతే ఆమె ఆశించిన విజయం మాత్రం గత ఏడాది ‘సరైనోడు’తో దక్కింది. ఐతే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కేథరిన్ కు అవకాశాలకు మాత్రం కొదవ లేకపోవడం విశేషమే.
ఈ మధ్యే కేథరిన్ ‘గౌతమ్ నంద’తో పలకరించింది. ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ కేథరిన్ గ్లామర్ ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శుక్రవారం కేథరిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. ఆ రెండు సినిమాల్లోనూ కేథరిన్ తనకు నప్పే గ్లామర్ రోల్సే చేసింది. ఆ సినిమాలకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నారు.
‘నేనే రాజు నేనే మంత్రి’లో లీడ్ హీరోయిన్ కాజలే అయినప్పటికీ కేథరిన్ కూడా కీలక పాత్రే చేస్తున్నట్లు దర్శకుడు తేజ చెప్పాడు. ట్రైలర్లో సిగరెట్ తాగుతూ కనిపించిన కేథరిన్ తన పాత్రపై ఆసక్తి రేకెత్తించింది. కాజల్ కొంచెం పద్ధతిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇందులో గ్లామర్ పార్ట్ అంతా కేథరిన్ చూసుకుంటుందేమో. ఇక కేథరిన్ నటించిన మరో సినిమా ‘జయ జానకి నాయక’. మామూలుగా కేథరిన్ సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుంటుంది కానీ.. ‘జయ జానకి..’లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లున్నారు.
రకుల్ ప్రీత్ ప్రధాన కథానాయికగా నటించగా.. ప్రగ్యా, కేథరిన్ అందాల ప్రదర్శనలో పోటీ పడనున్నారు. కేథరిన్ కనిపించే పాట ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పాటలో కేథరిన్ రెచ్చిపోయినట్లే ఉంది. మరి ఈ శుక్రవారం రాబోయే రెండు సినిమాలు కేథరిన్ కు డబుల్ ధమాకా ఫలితాన్నిస్తాయేమో చూడాలి.
Recent Random Post: