చిరు, మహేష్ లతో శ్రీను వైట్ల డబుల్స్

కామెడీ చిత్రాలతో శ్రీను వైట్ల టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. అయితే అదే కామెడీ జోనర్ లో పీక్ చూసేసిన శ్రీను వైట్ల ఆ తర్వాత ఏది చేసినా కూడా ప్లాప్ గానే మిగిలింది. బాద్షా తర్వాత నుండి శ్రీను వైట్లకు హిట్ అన్నదే లేదు. ఆగడుతో మొదలుపెట్టి వరసగా డిజాస్టర్స్ ను అందుకున్నాడు.

అయితే శ్రీను వైట్ల లాస్ట్ సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ తర్వాత బ్రేక్ తీసుకున్న ఈ దర్శకుడు ఢీ అండ్ ఢీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. మంచు విష్ణు హీరోగా రూపొందనున్న ఈ సినిమా ఆగస్ట్ నుండి సెట్స్ కు వెళ్లనుంది.

ఇదిలా ఉంటే శ్రీను వైట్ల చిరంజీవి, మహేష్ బాబులతో ఒక భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే దీనిపై ఈ దర్శకుడు స్పందించాడు. డబుల్స్ పేరుతో తాను ఒక మల్టీస్టారర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్న మాట నిజమేనని అయితే దానికి ఇంకా ఎవరినీ సంప్రదించలేదని తెలిపాడు.