మెగా ఆచార్య ఓటీటీ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ ల కాంబోలో రూపొందిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇతర భారీ సినిమాలు వరుసగా విడుదలకు సిద్దంగా ఉన్న కారణంగా ఆచార్య ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అంటే సాధారణంగా అంచనాలు మామూలుగా ఉండవు అలాంటిది ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించాడు.

తండ్రీ కొడుకులు కలిసి నటించిన సినిమా అవ్వడం వల్ల అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అంటూ ట్రేడ్ విశ్లేషకులు నమ్మకంగా ఉన్నారు. అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా భారీ మొత్తాలకు అమ్ముడు పోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లో ఇంకా ఇతర ఏరియాల్లో కూడా ఆచార్య సినిమా మంచి బిజినెస్ ను చేస్తుందట. సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉన్నది కనుక బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం కొనుగోలు చేయడం జరిగింది.

పోస్ట్ స్ట్రీమింగ్ కు గాను ఆచార్య కు భారీ మొత్తంలో అమెజాన్ వారు కట్టబెట్టారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చిరంజీవి మరియు రాంచరణ్ ల సినిమా అవడం వల్ల బాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఈ సినిమాకు రేటు పలికిందంటున్నారు. కేవలం అమెజాన్ మాత్రమే కాకుండా ఇంకా పలు ప్రముఖ ఓటీటీ లు కూడా ఈ సినిమాను కొనుగోలు చేయడం కోసం ప్రయత్నించాయి. కానీ చివరికి నిర్మాతలు అనుకున్న ప్రైస్ అమెజాన్ వారు ఇవ్వడం వల్ల ఆచార్య పోస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ వారికి దక్కడం జరిగింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటించింది.

నక్సలైట్ ఉద్యమం తో పాటు ఒక ఆసక్తికర కథను దేవాలయాల నేపథ్యంలో చూపించడంలో దర్శకుడు కొరటాల శివ సఫలం అయ్యాడని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటివరకు అపజయం అంటూ ఎరుగని కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించడం వల్ల కూడా సినిమాకు భారీ బజ్ క్రియేట్ అయింది. కేవలం వంద రోజుల్లో సినిమా చేస్తాం అంటూ ప్రకటించిన కొరటాల శివకు కరోనా అడ్డు రావడంతో చాలా ఆలస్యమైంది.

గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి వచ్చింది. మెగా స్టార్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది అని.. మాస్ మసాలా ఎలిమెంట్స్ ను భారీగా అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు. అలాగే మెగా అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చిరంజీవి మరియు రామ్ చరణ్ సినిమా ఉంటుందని కూడా అభిమానులు నమ్మకంతో ఎదురుచూస్తున్నారు.