
ధృవ’ సినిమా తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కొంచెం డల్లుగానే నడుస్తోంది. గత నెల రోజుల్లో వచ్చిన సినిమాల్లో ఒక్క ‘అప్పట్లో ఒకడుండేవాడు మాత్రమే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు వసూళ్లు బాగానే ఉన్నాయి కానీ అది క్రౌడ్ పుల్లర్ ఏమీ కాదు. ఇక సంక్రాంతి సినిమాల మీదే అందరి దృష్టీ ఉంది. అవి వచ్చాకే థియేటర్లు కళకళలాడబోతున్నాయి. వాటి కోసమే థియేటర్లు ఎదురు చూస్తున్నాయి.
ముఖ్యంగా సంక్రాంతి సినిమాల్లో ముందుగా రిలీజయ్యే చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ మీద హైప్ మామూలుగా లేదు. తొలి రోజు ఆ సినిమాకు పోటీ లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింటిలో థియేటర్లను ఈ సినిమాతోనే నింపేయనున్నారు.
12వ తారీఖు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం కేటాయించిన థియేటర్లలోనూ ముందు రోజు చిరంజీవి సినిమానే ప్రదర్శించనున్నారు. మెగాస్టార్ చిరంజీవికి తిరుగులేని పట్టున్న కోస్తా.. వైజాగ్ ఏరియాల్లో 90 శాతానికి పైగా థియేటర్లలో 11న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను ప్రదర్శించబోతున్నారు. రాజమండ్రి, వైజాగ్ లాంటి నగరాల్లో నూటికి నూరు శాతం థియేటర్లలో చిరు సినిమా ఆడబోతోంది.
మిగతా ఏరియాల్లో ఒకటీ అరా థియేటర్లను మినహాయించి చిరు సినిమాకే అంకితం చేసేయబోతున్నారు. పదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఉన్న హైప్ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం జరగబోతోంది. కాబట్టి తొలి రోజు వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డులు బద్దలవడం లాంఛనమే.
Recent Random Post: