ఆ కుర్రపిల్లతో చిరుకు జత కట్టాలనుంది

సరదాగా చెప్పారో.. నిజంగానే మనసులో ఉందో కానీ ఆసక్తి..షాకింగ్ కలగలిపినఫీలింగ్ వచ్చే మాట ఒకటి మెగాస్టార్ చిరు నోటి నుంచి వచ్చింది. ఖైదీ నంబరు150 సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమా రిలీజ్ కు ముందు మీడియాప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన చిరు.. సినిమా రిలీజ్ అయ్యాకప్రమోషన్ ను పక్కన పెట్టారు.

కాస్త గ్యాప్ ఇచ్చి.. తాజాగా తన తమ్ముడి కుమార్తె  నిహారికకు చిరు ఇంటర్వ్యూఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిరుతో పాటు చెర్రీ.. వివి వినాయక్ కూడాఉన్నారు. ర్యాపిడ్ క్వశ్చన్ రౌండ్ లో భాగంగా ఇప్పటికిప్పుడు తాను చేసినసినిమాల్లో ఏ సినిమాను మళ్లీ చేయాలనుకుంటున్నారని అడిగారు. దీనికి చిరుబదులిస్తూ.. ‘‘జగదేకవీరుడు అతిలోక సుందరి’’ అని చెప్పారు. మరి.. ఆసినిమాలో శ్రీదేవి క్యారెక్టర్ ఎవరితో చేస్తారన్న ప్రశ్నకు బదులిచ్చిన చిరు..చిన్నపాటి షాకింగ్ వ్యాఖ్య చేశారు.

తన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను మళ్లీ తీస్తే.. శ్రీదేవి స్థానంలోఆమె కూతురు చేస్తే బాగుంటుందని చెప్పి నవ్వేశారు. చూస్తుంటే.. మెగాస్టార్ కు యంగ్ హీరోయిన్లు తన మూవీస్ కి హీరోయిన్లుగా ఉండాలనుకుంటున్నారా?అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. చిరు చెప్పిన సమాధానం ఎవరూఊహించలేనిదిగా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.


Recent Random Post: