
పొలిటీషియన్ గా మారిన మెగాస్టార్ మళ్లీ హీరో గా రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన కుటుంబసభ్యులంతా సంతోషంలో మునిగితేలుతున్నారు. కుమారుడి సినిమా చూసేందుకు ఎన్నడూ లేనట్లుగా చిరు తల్లి స్వయంగా థియేటర్ కు మొదటి ఆట చూసేందుకు తరలివచ్చారు. హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటరులో చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ సినిమాను చూడడం విశేషం. ఆమెకు తోడుగా చిరు సతీమణి సురేఖ వచ్చారు. వీరితో పాటు హీరో అల్లు అర్జున్ దంపతులు కూడా రావడంతో అభిమానులు కేరింతలతో వారికి స్వాగతం పలికారు.
“బాస్ ఈజ్ బ్యాక్”, “స్టైలిష్ స్టార్” అంటూ అభిమానులు చేసిన నినాదాలతో సంథ్య థియేటర్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. చిరు కుటుంబాన్ని థియేటర్ లోకి పంపేందుకు పోలీసులు, బౌన్సర్లు నానా ఇబ్బందులూ పడాల్సి వచ్చింది. అంతకుముందు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో థియేటర్ లో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. బాణసంచా కాల్చి అభిమానులు పండగ చేసుకున్నారు.
కాగా ఖైది నెంబర్ 150 కలెక్షన్ల విషయంలో భారీ టార్గెట్ పెట్టుకున్నారు. మొదటి రోజు కలక్షన్స్ లో బాహుబలికి ఉన్న 22.4 కోట్ల రికార్డును తుడిచేయాలన్నది చిరు టార్గెట్ అని చెబుతున్నారు. 25 కోట్లు మొదటి రోజు కలెక్షన్ సాధించాలని చిరు చెప్పినట్లు టాక్. థియేటర్ల వద్ద సందడి చూస్తుంటే 30 కోట్లు వచ్చేలా ఉందంటున్నారు ఇండస్ర్టీకి చెందినవారు.
Recent Random Post: