ప‌వ‌న్ చేనేత‌ వస్త్రానికి రాజకీయ రంగు!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ త‌న రాజ‌కీయ ప్ర‌యాణాన్ని ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో ముందుకు తీసుకుపోతున్నారు. చేనేత సత్యాగ్రహం, గర్జన కార్యక్రమం ఇవాల‌ అమ‌రావ‌తిలో జరుగనున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌భ‌కు ప‌వ‌న్ అంటే మండిప‌డే ప్ర‌తిపక్షాలైన వైఎస్ఆర్‌కాంగ్రెస్‌, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు హాజ‌ర‌వుతున్నారు. దీంతోపాటుగా తెలంగాణ‌లో అధికార‌పార్టీ అయిన టీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎంపీ సైతం మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌టం గ‌మ‌నార్హం.

రాష్ట్రంలోని పలు దీర్ఘకా లిక సమస్యలపై ఆయా ప్రాంతాల ప్రజలు పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకు రావడం అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి వారిసమస్యలు పరిష్క రిస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మిక ప్రతినిధులు గతనెల 17న హైదరాబాద్‌లో పవన్‌కళ్యాణ్‌ను కలిశారు. ఉమ్మడి రాష్ట్రాల్లో చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి చేనేతకు తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని పవన్‌ ప్రకటించడం జరిగింది.

అలాగే చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు తన శక్తివంచనలేకుండా కృషి చేస్తానని వారికి సంఘీభావం ప్రకటించారు. చేనేత భారత జాతి సంపదనీ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారి సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చేనేత సత్యాగ్రహం, గర్జన కార్యక్రమాలకు హాజర‌వురనని పవన్‌ ఆనాడు కల్సిన నేతలకు హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పద్మ శాలీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో చేనేత సత్యా గ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. న‌వ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సమీపంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేసిన స్థలంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌టం ఒక కీల‌క ప‌రిణామామైతే…దీనికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ హాజ‌ర‌వ‌డం మ‌రో ప్ర‌త్యేక ప‌రిణామం.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు జ‌ర‌గ‌నున్న ఈ  సత్యాగ్రహానికి తెలంగాణ‌కు చెందిన‌ కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌, వైసీపీ క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక, టీఆర్ఎస్‌ మాజీ ఎంపీ గుండు సుధారాణి, కర్నాటకకు చెందిన‌ ఎమ్మెల్సీ కొండయ్య, యడ్ల గీత, సాధికార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎన్‌ఎన్‌ మూర్తి హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సత్యాగ్రహ శిబిరాన్ని సందర్శించి వారికి నిమ్మరసంతో దీక్షను విరమింప జేయనున్నారు. అనంతరం అక్కడే జరుగనున్న పద్మశాలీ గర్జన కార్యక్రమంలో పవన్‌కళ్యాణ్‌ చేనేత కార్మికుల సమస్యలపై ప్రసంగించనున్నారు.

అయితే పవన్‌ కళ్యాణ్‌ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి హాజరౌతున్నట్లు ప్రకటించగా, మంగళగిరిసభ రాజకీయంతో ముడిపడటంతో పరిణామాలు ఎలా ఉంటాయోనని చర్చానీయాంశంగా మారింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీకి చెందిన స్థానిక నేత‌లు జగ్గారపు బ్రదర్స్‌ నిర్వహిస్తుండగా, విపక్షాలకు చెందిన కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు హాజరు కానుండ‌టం గ‌మ‌నార్హం. అయితే ప్రస్తుతానికి ప‌వన్‌తో మిత్ర‌ప‌క్ష సంబంధాలు నెరుపుతున్న‌ టీడీపీ నాయకులు సదస్సుకు హాజర‌వుతారా,లేదా అన్నది సందేహాస్పదంగా మిగి లింది. మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అదే సామాజిక వర్గానికి చెందన వారు కావడంతో ఆయన హాజరుపై ఉత్సుకత చూపుతున్నారు. కాగా సదస్సుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి లక్షన్నరకు పైగా చేనేత వర్గాలవారు హాజర‌వుతారని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు, మంగళగిరిలలో భారీ ఎత్తున కటౌట్లు, హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.


Recent Random Post: