
ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా అన్ని వుడ్స్ తో పాటు.. భారత సినీ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బాహుబలి: దఇ కన్‌క్లూజన్. ఈ సినిమా కోసం నెలల తరబడి వెయిట్ చేస్తున్న వారంతా ఏప్రిల్ 28 ఎప్పుడు వస్తుందా అంటూ క్యాలెండర్ వైపు చూస్తున్న పరిస్థితి. అదే టైంలో ఈ సినిమా టికెట్‌ను ఎలా సంపాదించాలా? అని తెగ ప్లాన్లు వేసేస్తున్నారు. ఎవరికి వారు.. తమకున్న పరిచయాలతో వీలైనంత త్వరగా బాహుబలిని చూసేందుకు ఇప్పటికే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.
కోట్లాది మంది ఆశగా చూస్తున్న ఈ చిత్రం టికెట్లు దొరకటం అంత తేలికైన కత కాదనే చెప్పాలి. ఆన్ లైన్లో పెట్టినా.. హాట్ కేకుల మాదిరి నిమిషాల్లో బుక్ అయిపోవటం ఖాయం. ఇలాంటి వేళ.. బాహుబలి టికెట్‌ను సంపాదించటం ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే.. ఇలాంటి వాటికి ఊహించని ఆఫర్ ఇస్తోంది.. ధర్మా ప్రొడక్షన్స్.
బాహుబలిని మొదటిరోజునే.. పెద్ద కష్టపడకుండానే సినిమా టికెట్ పొందేందుకు ఎవరూ అంచనా వేయని రీతిలో ఒక ఆఫర్‌ను ప్రకటించింది. బాహుబలి ది బిగినింగ్ మూవీ రేపు మరోసారి రిలీజ్ కానుంది.ఈ సినిమాను కొనుగోలు చేసే వారికి.. మలిభాగం టికెట్ పక్కా అన్న హామీ ఇవ్వనున్నారు. అయితే.. ఈ ఆఫర్ ను ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో వర్తించదు. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం ఈ ఆఫర్ ను అమలు చేస్తున్నారు. సో.. బాహుబలి 2 పార్ట్ టికెట్ పెద్ద కష్టపడకుండా చూడాలంటే.. ఈ ఐదు రాష్ట్రాల్లో మినహాంచి.. ఫస్ట్ పార్ట్ టికెట్ కొనుగోలు చేస్తే సరి. ఆఫర్ బాగుంది కదూ..?
Recent Random Post: