
ఒక్కసారి దిల్ రాజు కాంపౌండ్‌లోకి ఎంటర్ అయిన డైరెక్టర్ ఎవరైనా అంత తేలిగ్గా బయటకి రారు. హిట్ ఇచ్చినా, ఫ్లాప్ ఇచ్చినా దర్శకులని తన నెక్స్‌ట్ సినిమాకి కమిట్ చేయించడం దిల్ రాజు స్టయిల్. హిట్ ఇచ్చిన దర్శకుడైనా, ఫ్లాప్ ఇచ్చినవాడైనా కానీ దిల్ రాజు ఇచ్చినంతే తీసుకోవాలి తప్ప ఎక్కువ డిమాండ్ చేయడానికి వుండదు.
వారితో కమిట్‌మెంట్‌కి ముందుగా సంతకం చేయించే ‘కండిషన్స్ అప్లయ్’ పేపర్‌లో చాలా క్లాజ్‌లు వుంటాయట. అయితే దిల్ రాజుతో సినిమా చేస్తే నిర్మాణ పరమైన ఇబ్బందులుండవు, హీరోలు దొరకరనే బాధ వుండదు, అన్నిటికీ మించి విడుదలకి ఎలాంటి సమస్యలు రావని దర్శకులు హ్యాపీగా సైన్ చేసేస్తారు.
అయితే దిల్ రాజు దర్శకులందరినీ ఇలా లాక్ చేసి పడేయడం వల్ల తమకి డైరెక్టర్లు దొరకడం లేదని ఇతర నిర్మాతలు వాపోతున్నారు. ఎప్పుడో తీసే సినిమా కోసం ముందు నుంచీ దర్శకులని ఎందుకు లాక్ చేసి పెడతాడంటూ గొణుక్కుంటున్నారు.
కానీ సింగిల్ సినిమా కాంట్రాక్ట్ వల్ల డైరెక్టర్స్‌లో సీరియస్‌నెస్ తక్కువ ఉండవచ్చునని, అందుకే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే వారి నుంచి పూర్తిస్థాయి అవుట్‌పుట్ రావచ్చునని, ర్యాపో పెరిగితే మరిన్ని సినిమాలు చేసుకోవచ్చుననేది దిల్ రాజు నమ్మే థియరీ. అందుకే ఎవరేమనుకున్నా కానీ తన ‘ఫ్యాక్టరీ’ తరహా ఫిలింమేకింగ్ పద్ధతిని అతను మార్చుకోవట్లేదట.
Recent Random Post:

















