దిల్‌ రాజు కాంపౌండ్ నుండి బయట పడ్డ వేణు శ్రీరామ్‌

దర్శకుడిగా చాలా ఏళ్ల క్రితం పరిచయం అయిన వేణు శ్రీరామ్‌ చేసింది కొన్ని సినిమాలే. అన్ని సినిమాలు కూడా దిల్‌ రాజు బ్యానర్‌ లోనే చేశాడు. సినిమాలు చేసినా చేయకున్నా కూడా దిల్ రాజు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్‌ వర్క్ చేస్తూ వచ్చాడు. దిల్‌ ప్రొడక్షన్‌ లో వేణు శ్రీరామ్‌ సుదీర్ఘ కాలంగా స్క్రిప్ట్‌ వ్యవహారాలు చూసుకునే టీమ్ లో సాలరీకి వర్క్ చేస్తున్నాడనే టాక్ ఉంది. వకీల్‌ సాబ్ తర్వాత మరో సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే వేణు శ్రీరామ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపించింది. కాని పరిస్థితులు మరోలా ఉన్నాయి.

దిల్‌ రాజు తదుపరి సినిమా విషయంలో వేణు శ్రీరామ్‌ కు క్లారిటీ ఇవ్వడం లేదు. బన్నీ తో సినిమా ను చేయాల్సి ఉంది. వేణు శ్రీరామ్ ఆ ప్రాజెక్ట్‌ తో చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్నాడు. కాని దిల్‌ రాజు ఐకాన్‌ కోసం బన్నీని ఒప్పించడంలో విఫలం అవుతున్నాడు. బన్నీ కోసం వెయిట్‌ చేద్దామని దిల్‌ రాజు చెప్పడంతో మళ్లీ ఎక్కువ కాలం మరో సినిమా కోసం వెయిట్‌ చేయలేను అంటూ వేణు శ్రీరామ్ అన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఒక యంగ్‌ హీరోకు శ్రీరామ్‌ వేణు కథ చెప్పి ఒప్పించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఆ సినిమా పట్టాలెక్కబోతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా మొదలు అవ్వబోతుంది. మళ్లీ వేణు శ్రీరామ్ దిల్‌ రాజు బ్యానర్‌ లో సినిమా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.