దిల్‌ రాజు, వేణు శ్రీరామ్‌ విభేదాలకు అసలు కారణం ఇదేనా?

వేణు శ్రీరామ్‌ గత పదేళ్ల కాలంగా దిల్ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మూడు సినిమాలను తెరకెక్కించాడు. అందులో రెండు సూపర్‌ హిట్ గా నిలిచాయి. అయినా కూడా దిల్ రాజు నుండి ఆశించిన స్థాయిలో పారితోషికం కాని అదనపు సాలరీ కాని వచ్చింది లేదు. దాంతో దిల్‌ రాజు నుండి దూరంగా జరగాలనే నిర్ణయానికి వేణు శ్రీరామ్ వచ్చాడంటూ సమాచారం అందుతోంది.

దిల్‌ రాజు నుండి వేణు శ్రీరామ్‌ కు వకీల్‌ సాబ్ కోసం అందిన పారితోషికం అతి తక్కువ. నెల వారి జీతంతో పాటు కొద్ది మొత్తంలో పారితోషికంను ఇచ్చాడట. ఆ పారితోషికం విషయంలో చాలా అసంతృప్తిగా వేణు శ్రీరామ్ ఉన్నాడట. దాంతో పాటు ఆయన నిర్మాణంలో ఉంటే ఎక్కువ సినిమాలు చేయలేక పోతున్నట్లుగా కూడా భావించిన వేణు ఇప్పుడు బయటి బ్యానర్‌ ల్లో సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తుంది.