షూటింగ్స్‌కు త్వరలో అనుమతులు రానుండగా జులై లేదా ఆగస్టులో థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు సినిమాల విడుదల విషయంలో మళ్లీ చర్చ మొదలైంది. విడుదలకు ముందు ఆగిపోయిన సినిమాలు మొదట విడుదల అయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. కాని తెలుగులో మాత్రం అలా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రెండు మూడు వారాల్లో ‘వి’ విడుదల కావాల్సి ఉంది అనగా లాక్‌డౌన్ మొదలు అయ్యింది. కనుక థియేటర్లు ఓపెన్ అవ్వగానే ‘వి’ వస్తుందనుకున్న వారికి నిరాశే మిగులబోతుంది.
నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను కాస్త వెయిట్ చేసి ఆ తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నాడు. ‘వి’ సినిమా విడుదల విషయంలో దిల్‌రాజు ఎలాంటి హింట్ ఇవ్వడం లేదు. కనుక సినిమా థియేటర్లు ప్రారంభం అయిన కనీసం రెండు నెలల తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ విషయంలో మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
చిన్న సినిమాలు మాత్రం థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే విడుదల అవ్వాలని భావిస్తున్నాయి. ప్రేక్షకులు వచ్చినా రాకున్నా థియేటర్లలో విడుదల చేసి ఆ తర్వాత డిజిటల్ మరియు శాటిలైట్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. కాని పెద్ద సినిమాలు మాత్రం థియేటర్లలో సినిమాలు ఆడే పరిస్థితిని బట్టి విడుదల చేయాలని భావిస్తున్నారు.
Recent Random Post: