
అల్లు అర్జున్‌కు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య ప్రస్తుతం ఎలాంటి వార్ నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘చెప్పను బ్రదర్’ కామెంట్లకు హర్టయిన పవన్ ఫ్యాన్స్.. బన్నీ ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా కూడా మారలేదు. అతడి మీద తమ వ్యతిరేకతను మళ్లీ మళ్లీ చూపిస్తూనే ఉన్నారు. ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్‌కు అదే పనిగా ‘డిజ్ లైక్స్’ కొట్టి బన్నీపై తమ అయిష్టతను చాటుకున్నారు. ఈ టీజర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక ‘డిజ్ లైక్స్’ తెచ్చుకున్న టీజర్‌గా రికార్డు సృష్టించడం విశేషం. ఐతే ఈ వ్యతిరేకత మాట ఎలా ఉన్నా.. ‘డీజే’ టీజర్ యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది.
పవన్ అభిమానులు అంతగా వ్యతిరేకిస్తున్న ‘డీజే’ టీజర్.. పవన్ సినిమా ‘కాటమరాయుడు’ టీజర్ వెనుకే నిలవడం విశేషం. ‘కాటమరాయుడు’ టీజర్ టాలీవుడ్ టీజర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఫాస్టెస్ట్ 1 మిలియన్.. 2 మిలియన్.. 3 మిలియన్.. 4 మిలియన్.. ఈ రికార్డులన్నీ ‘కాటమరాయుడు’ పేరిటే ఉండగా.. ప్రతి చోటా రెండో స్థానం ‘డీజే’ టీజర్‌దే కావడం విశేషం.
అంతే కాదు.. ‘కాటమరాయుడు’ తర్వాత లక్ష లైక్స్ కొట్టించుకున్న టీజర్ కూడా ఇదే అయింది. ‘కాటమరాయుడు’ 82 లక్షలకు పైగా వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ‘డీజే’ టీజర్‌కు డిజ్ లైక్స్ కొట్టడం కోసమని పవన్ ఫ్యాన్స్ కూడా ఈ టీజర్‌కు వ్యూస్ పెంచుతున్నట్లుగా ఉంది పరిస్థితి చూస్తుంటే.
Recent Random Post: