సీఎం కేసీఆర్ కు ఈటల శాఖలు..

మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పరిణామాలు చాలా వేగంగా సాగుతున్నాయి. భూముల కబ్జాపై రైతులు ఫిర్యాదు చేయడం.. దానిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. వెంటనే ఈటల స్పందించి వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం మరిన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి.

కబ్జా భూముల్లో అధికారులు డిజిటల్ సర్వే పూర్తిచేశారు. ఆ భూములు కబ్జా జరిగిన మాట నిజమేనని మెదక్ కలెక్టర్ ధ్రువీకరించారు. అయితే, దీనికి సంబంధించిన నివేదిక ఇంకా ప్రభుత్వానికి వెళ్లిందో తెలియదు కానీ మంత్రి ఈటల శాఖలు తప్పించారు. ప్రస్తుతం ఈటల వద్దనున్న వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను కేసీఆర్ కు అప్పగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖకు కొత్త మంత్రి రావడం ఖాయమని తెలుస్తోంది.