అక్కడికి పోతాడు చిన్నవాడు

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో వై ఆనంద్‌ ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ ఇంటిల్లిజెంట్‌ థ్రిల్లర్‌ డీమానిటైజేషన్‌ ఎఫెక్ట్‌ తీవ్రంగా వున్న టైమ్‌లో రిలీజ్‌ అయి కూడా బ్లాక్‌బస్టర్‌ అయింది. నిఖిల్‌ మార్కెట్‌ని పటిష్టం చేసిన ఈ చిత్రానికి యూనివర్సల్‌ అప్పీల్‌ వుందని డైరెక్టర్‌ ఆనంద్‌ నమ్ముతున్నాడు.

అందుకే దీనిని వైడర్‌ ఆడియన్స్‌కి తీసుకెళ్లే ఆలోచనతో వున్నాడు. హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి ఆనంద్‌ మీడియాకి చెప్పాడు. అయితే తన తదుపరి చిత్రాన్ని అల్లు శిరీష్‌తో ప్లాన్‌ చేస్తోన్న వై. ఆనంద్‌ ప్రస్తుతం ఆ చిత్రం కథాచర్చల్లో బిజీగా వున్నాడు. శిరీష్‌తో సినిమా పూర్తి చేసిన తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా బాలీవుడ్‌ రీమేక్‌ పనులు ముమ్మరం చేస్తానని అతను తెలిపాడు.

ఇంకా రీమేక్‌ నిమిత్తం బాలీవుడ్‌ నటులు ఎవరినీ కలుసుకోలేదని, కాకపోతే అర్జున్‌ కపూర్‌, సోనాక్షి సిన్హాతో రీమేక్‌ చేయాలని వుందని చెప్పాడు. తెలుగు వెర్షన్‌ నిర్మించిన పి.వి. రావు హిందీ రీమేక్‌ని కూడా నిర్మిస్తారని ఆనంద్‌ తెలియజేసాడు. ఇకపోతే శిరీష్‌తో చేసే చిత్రం కూడా ఆసక్తికరమైన కథాంశంతోనే తెరకెక్కుతుందని, ఇందులో అవసరాల శ్రీనివాస్‌ ఒక కీలక పాత్ర చేయబోతున్నాడని ఆయన రివీల్‌ చేసాడు.


Recent Random Post: