
అమెరికాలో భయంభయంగా బతుకుతున్నారెందుకు.. ట్రంప్ ఛీ కొడుతున్నా అక్కడే పట్టుకు వేలాడుతారెందుకు? మీలో టాలెంట్ ఉందా.. మా దేశానికి వచ్చేయండి. మేం మీకు ఛాన్సిస్తాం. . అంటున్నాయి ఐరోపా దేశాలు. ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ విధానాల వల్ల ఇబ్బందులు పడడమే కాకుండా.. ఉద్యోగాలు, ప్రాణాలూ ప్రమాదంలో పడిన భారతీయు టెక్ నిపుణులపై ఐరోపా దేశాల్లోని సంస్థలు కన్నేశాయి. మంచి నైపుణ్యంతోపాటు కష్టించి పనిచేసే స్వభావం ఉన్న భారతీయ నిపుణులను తమ దేశాలకు రప్పించడానికి ఇదే సమయమని వారు భావిస్తున్నారు.
తగిన పత్రాలు లేకుండా అమె రికాలో నివసిస్తున్న వారిని స్వదేశాలకు తిరిగి పంపించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని ట్రంప్ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇమి గ్రేషన్ చట్టాలను పటిష్టంగా అమలు చేసేందుకు గాను అధికారుల పరిధిని పెంచింది. దీంతో అమెరికాలో జీవిస్తున్న దాదాపు కోటి పది లక్షల మంది వాళ్ల వాళ్ల స్వదేశాలకు తరలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో దాదాపు మూడు లక్షల మంది భారతీయులు తగిన ఆధారాలు లేకుండానే నివసిస్తున్నట్టు సమాచారం. ట్రంప్ తాజా ఆదేశాలతో దాదాపు 3 లక్షల మంది భారతీయులు స్వదేశీ బాట పట్టాల్సిన పరిస్థితులు రానున్నాయి. భారత్ నుంచి చాలా మంది స్టడీ వీసాలు, ఇతర వీసాలపై అమెరికా చేరుకొని చిన్నచిన్న ఉద్యో గాలను వెతుక్కొని అక్కడే గ్రీన్ కార్డు పొందేందుకు ప్రయత్నిస్తుండడం సర్వసాధా రణమే. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న అమెరికా రక్షణాత్మక నిర్ణయాలతో ‘ఫెడరల్ ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ చట్టాలలో గణనీయ మార్పులు రానున్నాయి.
ఇదే సమయంలో మంచి నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్స్ సేవలను వాడుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా ఐరోపా దేశాలు అంటున్నాయి. యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్‌తో బలమైన వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్న తాము ఎన్‌ఆర్‌ఐ నిపుణుల సేవలను వాడుకోనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. భారతీయుల పాత్ర లేకుండా ఐరోపా ఐటీ పరిశ్రమ పరిపూర్ణం కాలేదని ఆయన అన్నారు. సో… ఇండియన్ టెక్కీస్… లీవ్ అమెరికా.. చలో యూరప్.
Recent Random Post: