భ‌ర్త‌ను బాధ‌పెట్టిన‌ గీతామాధురి

బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్ -2 విజేత‌గా గాయ‌ని గీతామాధురి నిలుస్తుంద‌ని అంద‌రూ ఆశించారు. కానీ చివ‌రికి ఆమె ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో నిక్క‌చ్చిగా ఉంటూ అవ‌స‌ర‌మైన చోట ప్ర‌శ్నిస్తూ, నిల‌దీస్తూ త‌న‌కంటూ ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక అభిమానాన్ని సంపాదించుకున్నారు. ముక్కుసూటిత‌నం ఆమె బ‌లం, బ‌ల‌హీన‌త అని కూడా చెప్పొచ్చు.

గీతామాధురి, న‌టుడైన ఆమె భ‌ర్త నందు ఇటీవ‌ల ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. బిగ్‌బాస్ హౌస్ సంగ‌తులు కూడా ఇంట‌ర్వ్యూలో స‌హ‌జంగానే ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. బిగ్‌బాస్ హౌస్‌లోకి గీత‌ వెళ్ల‌డం, అక్క‌డి ప‌రిణామాల‌పై నందు స్పందిస్తూ తానెందుకు బాధ‌ప‌డాల్సి వచ్చిందో వివ‌రించాడు.

గీత బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లిన‌ప్పుడు ఎలా ఫీల్ అయ్యార‌ని ప్ర‌శ్నించ‌గా …గాయ‌నిగా గీత అంద‌రికీ తెలుస‌న్నాడు. కానీ వ్య‌క్తిగా ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలియ‌ద‌న్నాడు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ్డం గీత స్వ‌భావ‌మ‌న్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన త‌ర్వాత ఇలా మాట్లాడితే ఇబ్బందులు ప‌డుతుంద‌ని ముందే ఊహించిన‌ట్టు నందు చెప్పాడు. తాను ఊహించిన‌ట్టుగానే బిగ్‌బాస్ హౌస్‌లో జ‌రిగింద‌న్నాడు. అంద‌రి ఆలోచ‌న‌ల‌కు విభిన్నంగా గీత ఆలోచ‌న‌లు ఉండేవ‌న్నాడు.

ఓ రోజు గీత త‌న స‌హ‌జ ధోర‌ణిలో బిగ్‌బాస్ హౌస్‌లో మాట్లాడింద‌న్నాడు. దీంతో సోష‌ల్ మీడియాకు గీత టార్గెట్ అయిన‌ట్టు నందు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మొద‌టి వారం అంతా గీత‌పై ట్రోలింగ్స్ జ‌రిగాయ‌న్నాడు. ఆ స‌మ‌యంలో గీత‌ను అపార్థం చేసుకున్నార‌ని, చెడ్డ‌పేరు వ‌స్తోంద‌ని బాధ‌ప‌డిన‌ట్టు నందు చెప్పుకొచ్చాడు. అయితే ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే గీత అంద‌రికీ స్నేహితురాలైంద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో గీత త‌న స‌హ‌జ ధోర‌ణితో నందును బాధ‌పెట్టార‌న్న‌ మాట‌.