టైం చూసి రివ్యూల మీద ఏసుకున్నాడుగా

క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళుతున్న డీజే..దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ మూవీ సక్సెస్ మీట్‌ను తాజాగా నిర్వ‌హించారు. మూడు రోజుల‌కు రూ.65 కోట్లు.. నాలుగు రోజుల‌కు రూ.75 కోట్ల క‌లెక్ష‌న్ మార్క్‌ను ట‌చ్ చేసిందంటూ వ‌స్తున్న వార్త‌ల్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తూ చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పుకొస్తే.. బాహుబ‌లి 2 త‌ర్వాత డీజే నంటూ బాలీవుడ్ సైతం ప్ర‌శంసిస్తోంద‌ని చెప్పుకుంటూ త‌మ‌ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది చిత్ర బృందం.

స‌క్సెస్ మీట్ లో మిగిలిన వారి మాట‌ల‌కు.. చిత్ర ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ మాట‌ల‌కు కాస్త తేడా ఉంది. విజ‌యాన్ని అస్వాదిస్తున్న‌ట్లుగా మిగిలిన వారు మాట్లాడితే.. తాజా స‌క్సెస్ వేళ‌.. సినిమా రివ్యూల మీద టార్గెట్ చేస్తూ హ‌రీశ్ వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. సినిమా భారీగా క‌లెక్ష‌న్లు సాధిస్తూ..బంప‌ర్ హిట్ కావ‌ట‌మే కాదు.. త‌మ ఇరువురి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింద‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు.

బ‌న్నీ పిలిచి.. సినిమా చేస్తున్నామ‌ని త‌న‌కు చెప్పి.. ఈ సినిమా ఇద్ద‌రి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాల‌న్నార‌ని.. అయ్యింద‌న్నారు. విమ‌ర్శ‌ల‌కు బాక్సాఫీస్ స‌మాధానం చెబుతుందంటే.. సినిమా అంటే ఏమిటో నిర్వ‌చ‌నం చెప్ప‌టంతో పాటు.. సినిమా బాగోపోతే ఎవ‌రిని త‌ప్పు ప‌ట్ట‌కూడ‌దో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదే స‌మ‌యంలో సినిమా రివ్యూల మీద త‌న‌దైన శైలిలో పంచ్ లు విసిరారు. సినిమా అంటే వినోద‌మ‌ని.. సినిమా న‌చ్చ‌క‌పోతే ఈ సీన్‌.. స్టోరీ.. క్యారెక్ట‌ర్ బాగాలేద‌ని విమ‌ర్శించాలే త‌ప్పించి డైరెక్ట‌ర్‌ని విమ‌ర్శించ‌కూడ‌ద‌న్నారు. డ‌బ్బులు పెట్టి సినిమా చూసే ప్రేక్ష‌కులు రివ్యూ ఇవ్వాలే కానీ వేరే వారిచ్చిన రివ్యూల‌ను న‌మ్మొద్ద‌ని చెప్పుకున్నాడు. త‌మ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల్ని కొట్టుకుంటూ వెళుతోంద‌న్నారు. ఓ మంచి మూవీ చేసిన‌ప్పుడు క‌లెక్ష‌న్ల గురించి మాట్లాడాలే త‌ప్ప రివ్యూలు కాద‌న్నారు. మొత్తానికి రివ్యూల మీద త‌న‌కున్న కోపాన్ని హ‌రీశ్ శంక‌ర్‌ స‌క్సెస్ మీట్ లోనూ మ‌ర్చిపోలేద‌ట్లుందే.


Recent Random Post: