
వరుసగా రెండు భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన ఆనందంలో వున్న దిల్ రాజు ఇదే ఊపులో ఈ ఏడాది హ్యాట్రిక్ పూర్తి చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. అల్లు అర్జున్‌తో హరీష్ శంకర్ తీస్తోన్న ‘డిజె’ అలియాస్ ‘దువ్వాడ జగన్నాధమ్’ మే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రానికి పకడ్బందీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోన్న రాజు టీజర్‌ని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నాడు.
శతమానం భవతి ముప్పయ్ కోట్లు సాధించడం, నేను లోకల్ కూడా అదే బాటలో పయనిస్తూ వుండడంతో ఈ భారీ చిత్రంతో దిల్ రాజు టార్గెట్ ఏమిటనుకుంటున్నారు? దిల్ రాజు లెక్క ప్రకారం ‘డిజె’ బన్నీ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్సులున్నాయని సన్నిహితులతో చెబుతున్నాడట. ఇందులో బన్నీ ‘అదుర్స్’లో ఎన్టీఆర్ చేసిన ‘చారి’ తరహా పాత్రని చేస్తున్నట్టు టాక్. ఫస్ట్ లుక్‌లో అల్లు అర్జున్ గెటప్, డైలాగ్ డెలివరీ షాక్‌కి గురి చేస్తాయని అంటున్నారు.
టీజర్ చూసిన వాళ్లయితే సూపర్‌గా వుందంటూ తప్పకుండా అందరూ థ్రిల్ అయిపోతారని ఘంటాపథంగా చెబుతున్నారు. అల్లు అర్జున్ లుక్ ఎలా వుంటుందన్నది ఇంత కాలం రివీల్ చేయనిది అందుకేనట. కనీసం వర్కింగ్ స్టిల్ కూడా బయటకి రాకుండా చాలా జాగ్రత్తే తీసుకున్నారు. ఫస్ట్ లుక్‌తో షాక్ వేల్యూ వుండాలనేది హరీష్ శంకర్ కోరిక. అందుకు తగ్గట్టే బన్నీ లుక్ కాపాడుకుంటూ వచ్చాడు. అయితే విడుదలకి కొద్ది రోజుల ముందు గెటప్ రివీల్ చేస్తే అలవాటు పడరని, మూడు నెలల ముందుగా డిజె ఎలాగుంటాడో చూపించేస్తున్నారు.
Recent Random Post: