బాలయ్యని అక్కడ కొట్టాడు

పూరి జగన్నాథ్‌తో బాలకృష్ణ సినిమా ఖరారైపోయినట్టే. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ మాటలయితే అయిపోయాయి. చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన బాలకృష్ణ వారందరినీ కాదని పూరికి ఎందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు? కథ చెప్పిన పూరి జగన్నాథ్‌ నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసి, అయిదు నెలల్లో ఫస్ట్‌ కాపీ ఇచ్చేస్తానని చెప్పాడట. వేగంగా పని చేయడాన్ని ఇష్టపడే బాలకృష్ణ అతను చెప్పిన ఆ షెడ్యూల్‌కి ఫ్లాట్‌ అయిపోయారట.

దసరాకి సినిమా రిలీజ్‌ చేసుకోవచ్చని పూరి కాన్ఫిడెంట్‌గా చెప్పేసరికి, కథ ఆల్రెడీ నచ్చడంతో ఇక బాలయ్యకి నో చెప్పడానికి కారణమే కనిపించలేదట. పూరి జగన్నాథ్‌ ఎప్పుడు ఎవరితో చేసినా తన వేగంతోనే హీరోలని ఆకట్టుకుంటాడు. నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసేస్తాడనే టాప్‌ హీరోలు అతడిని ప్రిఫర్‌ చేస్తుంటారు. అయితే వేగం కోసం పోతే అతను తీసే నాసిరకం సినిమాలతో యాక్సిడెంట్లు అయిపోతున్నాయని ఈమధ్య పూరిని ఓవర్‌లుక్‌ చేస్తున్నారు.

దాంతో సీనియర్‌ హీరోల కోసం ట్రై చేసిన పూరి జగన్నాథ్‌కి వెంకటేష్‌ దగ్గర వర్కవుట్‌ కాలేదు కానీ బాలకృష్ణ మాత్రం ఓకే చెప్పేసారు. బాలయ్యని పూరి ఎలా ప్రెజెంట్‌ చేయబోతున్నాడనేది ఖచ్చితంగా ఆయన అభిమానులకి ఎక్సయిటింగ్‌ ఎలిమెంటే.


Recent Random Post: