
గత నెలలో వచ్చిన ఆమిర్ ఖాన్ సినిమా ‘దంగల్’కు విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రెండు మూడు నెలల ముందు నుంచే బాలీవుడ్ సెలబ్రెటీలకు ఆమిర్ ప్రివ్యూలు వేయడం.. ఈ సినిమా గురించి వాళ్లంతా గొప్పగా చెప్పడం.. ప్రి రిలీజ్ ప్రివ్యూల్లోనూ ఇలాంటి టాకే రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
అంత భారీ అంచనాల్ని కూడా అందుకుని ‘దంగల్’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు ఇదే కోవలో హృతిక్ రోషన్ సినిమా ‘కాబిల్’ కూడా విడుదలకు ముందే అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. బుధవారం విడుదలవుతున్న ఈ సినిమాను ముందే బాలీవుడ్ సెలబ్రెటీలకు ప్రివ్యూగా వేశారు. అక్కడ అద్భుతమైన టాక్ వచ్చింది.
ప్రివ్యూకు వచ్చిన ప్రతి ఒక్కరూ కాబిల్ గురించి గొప్పగా మాట్లాడారు. ఇదో అద్భుతమైన సినిమా అంటూ పొగిడేశారు. అక్షయ్ కుమార్.. రిషి కపూర్.. అశుతోష్ గోవారికర్.. రేఖ.. ట్వింకిల్ ఖన్నా.. అనిల్ కపూర్.. సోనమ్ కపూర్.. సాజిద్ నడియాడ్ వాలా.. ఇలా ఎంతోమంది సెలబ్రెటీలు ‘కాబిల్’పై ప్రశంసల జల్లు కురిపించారు.
హృతిక్ రోషన్ నటన అమోఘమంటూ పొగిడేశారు. ఇక బాలీవుడ్ సమీక్షకులు చాలామంది అప్పుడే రివ్యూలు కూడా ఇచ్చేశారు. చాలామంది 4 స్టార్స్ ఇచ్చారు ఈ సినిమాకు. హృతిక్.. యామి గౌతమ్ ఈ సినిమాలో అంధులుగా నటించడం విశేషం. సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించాడు.
Recent Random Post:

















