
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీ కాలం ముగుస్తున్న క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఓవైపు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అనేక పేర్లు ఈ సందర్భంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉండటం గమనార్హం. అయితే దీనిపై వెంకయ్యనాయుడు సెటైరికల్‌గా స్పందించారు. తనకు ఉషాపతిగా మాత్రమే ఉంటే చాలని వ్యాఖ్యానించారు.
మాటల మాంత్రికుడిగా పేరున్న వెంకయ్యనాయుడు తన సతీమణి పేరుతో సెటైర్ వేశారు. `నాకు రాష్ట్రపతి అవ్వాలని లేదు. అలాగే ఉప రాష్ట్రపతి అవ్వాలని లేదు. ప్రస్తుతానికి ఉషాపతిగా (వెంకయ్యనాయుడి సతీమణి పేరు ఉష) చాలా సంతోషంగా ఉన్నాను’ అంటూ చమత్కరించారు.
ఇదిలాఉండగా…ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ 67 సంవత్సరాల బీజేపీ నాయకుడు ప్రస్తుతం కేంద్రంలో పట్టణాభివృద్ధి, సమాచార-ప్రసారశాఖ నిర్వహిస్తున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థించిన మొదటి నాయకుల్లో ఒకరు. దక్షిణాదిలో విస్తరించాలని ఉరకలేస్తున్న కాషాయపార్టీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చునని అందుకే ఈయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించవచ్చని ప్రచారం సాగుతోంది.
Recent Random Post: