
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఫినాన్షియల్‌గా ఎంత స్ట్రాంగో చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబుకు తన ముద్దుల కూతురు మంచు లక్ష్మి అంటే ఎంత ప్రేమో కూడా తెలిసిందే. ఐతే మంచు లక్ష్మి మాత్రం సినిమాలు తీయడానికి తన దగ్గర డబ్బులు లేవంటోంది. అందువల్లే ఈ మధ్య సినిమాల నిర్మాణం తగ్గిపోయిందని ఆమె అంటోంది. ‘‘సినిమాల నిర్మాణంలో మళ్లీ వేగం పెంచాలి. ఇటీవల డబ్బులు లేక స్పీడ్ తగ్గింది. నేను ఇంతకుముందు మంచి కంటెట్ ఉన్న కథలతోనే సినిమాలు చేశా. అలాంటి కథలు కుదరాలి. అప్పుడే సొంత ప్రొడక్షన్లో సినిమా చేస్తా. ఇటీవలే బయటి వాళ్లకు ఒక సినిమా కమిటయ్యా. కానీ ఇంకా దానికి సంతకం చేయలేదు. ఆ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా’’ అని తన కొత్త సినిమా ‘లక్ష్మీబాంబు’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి తెలిపింది.
ఇక ‘లక్ష్మీబాంబు’ సినిమా గురించి లక్ష్మి చెబుతూ.. ‘‘ఇందులో నేను చేసింది నా కెరీర్లో ఛాలెంజింగ్ రోల్. డైరెక్టర్ కథ చెప్పగానే ఓకే చేశాను. సింగిల్ షెడ్యూల్‌లో ఏకధాటిగా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశాం. మా తమ్ముడు మనోజ్ కొరియోగ్రాఫ్ చేసిన క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలైట్ అవుతుంది. అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా పేరు పెట్టి సినిమా చేయడం చాలా సంతోషంగా అనిపించింది. సాధారణంగా సినిమా టైటిల్స్ కథను బట్టి పెడుతుంటారు. కానీ ఇందులో కథకు తగ్గట్లుగా.. నా పేరు కూడా కలిసొచ్చేలా టైటిల్ కుదిరింది. నా పేరుతో టైటిల్ పెట్టడంతో నాకు కూడా మంచి మార్కెట్ ఉందని ఫీలయ్యా. మా కుటుంబ సభ్యులు కూడా ఈ టైటిల్ ప్ల చాలా సంతోషించారు’’ అని తెలిపింది.
Recent Random Post: