కన్‌ఫ్యూజ్‌ చేస్తోన్న నందమూరి-నాని

రెండు సినిమాలకి ఐడెంటికల్‌ టైటిల్స్‌ పెట్టడమే కాకుండా అవి రెండూ ఒకేసారి వార్తల్లోకి వచ్చేసరికి జనం కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. నానితో దిల్‌ రాజు ప్రస్తుతం ‘ఎంసిఏ’ అనే చిత్రం తీస్తున్నాడు. ‘ఓ మై ఫ్రెండ్‌’ దర్శకుడు వేణు శ్రీరామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ముప్పయ్‌ శాతం షూటింగ్‌ పూర్తయింది.

అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఎంసిఏ అంటే ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అన్నమాట. ఇంచుమించు ఇలాంటి టైటిల్‌నే పెట్టుకున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్‌. ‘ఎంఎల్‌ఏ’ అంటూ అతను చేస్తోన్న సినిమాకి ఫుల్‌ ఫామ్‌ ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’.

ఈ రెండు చిత్రాల టైటిల్స్‌ ప్రస్తావనకి వచ్చినపుడు దేనిగురించి మాట్లాడుతున్నారనేది అర్థం కావడం లేదు. నాని సినిమానా, కళ్యాణ్‌రామ్‌ సినిమానా అని నొక్కి అడగాల్సి వస్తోంది. మీడియాతో పాటు సినీ ప్రియులు కూడా ఈ కన్‌ఫ్యూజన్‌ ఎదుర్కొంటున్నారు. రిలీజ్‌ టైమ్‌లో రెండూ దగ్గర దగ్గరగా విడుదలైనా ఈ కన్‌ఫ్యూజన్‌ ఎక్కువ వుంటుందని అంటున్నారు.

ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్స్‌లో కూడా తలనొప్పి ఎదురయ్యే అవకాశముంటుంది. ఆ సంగతి గుర్తించి అయినా ఈ రెండు చిత్రాల మధ్య గ్యాప్‌ మెయింటైన్‌ చేస్తే బాగుంటుంది. ఇందులో ఫన్‌ ఫ్యాక్ట్‌ ఏమిటంటే ‘ఎంఎల్‌ఏ – మంచి లక్షణాలున్న అబ్బాయి’ పేరుతో ఎన్టీఆర్‌తో హరీష్‌ శంకర్‌ ఒక సినిమా చేద్దామని అనుకున్నాడు. అది మెటీరియలైజ్‌ కాలేదు కానీ ఇప్పుడా టైటిల్‌ ఎన్టీఆర్‌ సోదరుడి సినిమాకే ఫిక్సయింది.


Recent Random Post: