ఖాళీ దొరికితే ఆమె గుర్రమెక్కేస్తుంది

శ్రీలంక సుందరి జాక్వెలీన్‌ ఫెర్నాండేజ్‌కి అందాల ఆరబోతే కాదు గుర్రమెక్కి సవారీ చేయడమూ తెలుసు. గుర్రమెక్కి స్వారీ చేయాలనే తన చిన్ననాటి కోరికని తీర్చుకునే దిశగా ఆమె హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ పొందుతోంది. తీరిక ఉన్నపుడల్లా జాక్వెలీన్‌ హార్స్‌ రైడర్స్‌ క్లబ్‌లోనే దర్శనమిస్తోందట.

ఎలాగైనా ఛాంపియన్‌లా హార్స్‌ రైడింగ్‌ చేయాలని, వీలుంటే తన స్కిల్స్‌ సినిమాల్లో చూపెట్టాలని జాక్వెలీన్‌ తహతహలాడిపోతోంది. హార్స్‌ రైడింగ్‌లో తన మెలకువలు, ప్రోగ్రెస్‌ ఫాన్స్‌కి చూపెట్టడానికి వీడియో కూడా అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన జాక్వెలీన్‌ ప్రస్తుతం అథ్లెట్స్‌కి ఏమాత్రం తీసిపోని ఫిజిక్‌తో అదరగొడుతోంది.

ఇన్ని సైడ్‌ ఎట్రాక్షన్స్‌ కూడా ఉన్నాయి కనుక ఆమె త్వరలోనే పూర్తి స్థాయి లేడీ జేమ్స్‌బాండ్‌ సినిమా చేసేస్తే సరి. త్వరలో ఒక ఆంగ్ల చిత్రంలో కనిపించి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ని వశం చేసుకోవాలని చూస్తోన్న జాక్వెలీన్‌ ఇటు బాలీవుడ్‌లోను వరుస ఆఫర్లతో యమ బిజీగా వుంది.


Recent Random Post: