ఆచార్యకు కాజల్‌ హ్యాండ్‌ వార్తపై క్లారిటీ

చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం నుండి ఇప్పటికే త్రిష తప్పుకున్న విషయం తెల్సిందే. ఆమె మూడు రోజుల షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత స్క్రిప్ట్‌ మార్చారు, తన పాత్రకు ప్రాముఖ్యత లేకుండా తీస్తున్నారంటూ వెళ్లి పోయింది. దాంతో ఆమె స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ఆమె షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్న సమయంలో కరోన లాక్‌ డౌన్‌ కారణంగా షూట్స్‌ ఎక్కడికి అక్కడ బంద్‌ అయ్యాయి.

ఈ లాక్‌ డౌన్‌ సమయంలోనే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌ సినిమాలో ఈమెకు ఆఫర్‌ వచ్చిందని దాంతో ఆచార్య చిత్రాన్ని ఈమె కాదన్నది అంటూ ప్రచారం మొదలైంది. చిరంజీవి కోసం మరో హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ కాజల్‌ పీఆర్‌ టీం క్లారిటీ ఇచ్చింది.

గత మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్థవం. ఆచార్య చిత్రం కోసం కాజల్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. చిరంజీవి గారితో మళ్లీ నటించాలని ఆమె ఉవ్విల్లూరుతోంది. ఖచ్చితంగా ఆచార్య చిత్రంలో చిరంజీవికి కాజల్‌ మంచి జోడీగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆచార్య చిత్రం సక్సెస్‌ లో కాజల్‌ పార్ట్‌ అవ్వబోతుందని వారు అంటున్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నారు. అప్పుడు చిరుతో కాజల్‌ జాయిన్‌ కాబోతుంది. ఇండియన్‌ 2 కాకుండా కాజల్‌కు ప్రస్తుతం మరే సినిమా ఛాన్స్‌ లేదు. అలాంటప్పుడు ఈ అమ్మడు చిరంజీవి సినిమాను ఎలా వద్దనుకుంటుంది. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే కాజల్‌ అంత తెలివి తక్కువ హీరోయిన్‌ మరొకరు ఉండరు. కాని కాజల్‌ ఆ నిర్ణయం తీసుకోలేదు.


Recent Random Post: