Karthika Deepam Serial 29th January Episode Online 2020

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 716 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 717 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (జనవరి 29) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే.

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే…

కార్తీక్ పిలవడంతో మౌనిత.. శ్రావ్య డెలివరీ కోసం వస్తుంది. అయితే మౌనిత దీపని పిచ్చిదాన్ని చెయ్యడానికి ఇన్‌జెక్షన్ ఎక్కిస్తూ.. దీపకి వేరేలా అర్థమయ్యేలా మాట్లాడుతుంది. దాంతో శ్రావ్యకు ఇన్‌జెక్షన్ చెయ్యకుండా ఆపి.. ‘దాన్ని నమ్మొద్దు.. అది డెలివరీ చెయ్యడానికి రాలేదు. బిడ్డని చంపడానికే వచ్చింది’అంటూ అందరి ముందు చెబుతుంది దీప. ఆ మాటలు నమ్మిన సౌందర్య.. మౌనిత దగ్గరకు వచ్చి.. ‘ఏంటీ ఆ ఇన్‌జక్షన్? అసలు ఏం చేద్దామని వచ్చావ్?’ అంటుంది. వెంటనే మౌనిత.. కార్తీక్‌తో ‘చూశావా కార్తీక్.. అందుకే నేను ఇక్కడికి రావాలంటే.. నీ పర్మీషన్.. నీ వాళ్ల పర్మీషన్ కావాలని చెప్పాను. నువ్వేమో యు డు వాట్ ఐ సే అంటూ ఇంగ్లీష్‌లో కోప్పడి నన్ను ఇక్కడికి రప్పించావ్..’ అంటుంది దీపని, సౌందర్యని కార్తీక్ ముందు బ్యాడ్ చేస్తుంది.

అది కాదు డాక్టర్ బాబు..

ఇంతలో రిజ్వానా(మరో డాక్టర్).. మౌనిత చేతిలోని ఇన్‌జక్షన్ తీసుకుని.. ‘ఇది పాయిజన్ అని నీకు ఎవరు చెప్పారమ్మా? ఏ లాబ్‌లో అయినా చెక్ చెయ్యించండి. ఇది పాయిజన్ కాదు.. శ్రావ్యకు ఇది ఇవ్వడం చాలా అవసరం’ అంటూ అరుస్తుంది. అయినా దీప మనసులో భయం పోకపోవడంతో.. ‘అది కాదు డాక్టర్ బాబు’ అని ఏదో చెప్పబోతుంటే.. కార్తీక్ కోపంగా.. ‘నువ్వు.. మారవా?’ అంటూ దీపని తిట్టబోతాడు కార్తీక్. ఇంతలో సౌర్య, హిమలు అక్కడికి రావడం గమనించి.. ‘ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉండటం మంచిది’ అంటూ అరుస్తాడు.

మా వంటలక్క..

కార్తీక్ మాటలతో సౌర్యకు కోపం వస్తుంది. ఇంతలో రిజ్వానా ‘అసలు ఎవరు ఈమె? చెప్పరేంటీ?’ అంటుంది. అంతా మౌనంగా ఉంటారు. వెంటనే హిమ కోపంగా.. ‘మా వంటలక్క’ అంటుంది. అందంగా గమనిస్తున్న సౌర్యకు ఆవేశం తన్నుకొస్తుంది. ‘మీరు రక్తం అమ్ముకోవడానికి వచ్చినదానికి రక్తం అమ్ముకుని వెళ్లాలి. చాలకపోతే ఇంకా అడగాలి. అంతే కానీ ఇలా లేనిపోనివి మాట్లాడి గొడవ పెడతావా?’ అంటూ తిడుతుంది రిజ్వానా దీపను. అప్పుడు కూడా ఎవ్వరూ నోరు మెదపకపోవడంతో సౌర్య రగిలిపోతుంది. ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

ఈ ఇన్‌జెక్షన్ ఇవ్వు..

ఇంతలో కార్తీక్.. ‘ముందు నువ్వు వెళ్లి ఈ ఇన్‌జెక్షన్ ఇవ్వు’ అని మౌనితని లోపలికి పంపిస్తాడు. దీప కూడా రిజ్వానా చెప్పినట్లు.. పాయిజన్ కాదు అనే మాటలతో కూల్ అవుతుంది. దీప సౌందర్య దగ్గరకు వెళ్లి నిలబడుతుంది. ఇంతలో మురళీ కృష్ణ బయట నుంచి ఏదో కొనుక్కుని వస్తాడు. అంతా సీరియస్‌గా ఉండటం చూసి.. ఏమైంది అంటాడు. శ్రావ్యకు ఏమైంది అంటూ మరో ప్రశ్న వేస్తాడు.

హిమకు అనుమానం..

మురళీ కృష్ణ కంగారు చూసి.. ఆదిత్య, ఆనందరావులు.. ‘ఏం కాలేదు మావయ్యగారు.. ఇది వేరే గొడవ’ అని చెప్పడంతో.. దీప వైపు చూసి.. ‘అమ్మా దీపా? ఏమైంది?’ అంటాడు. అక్కడే ఉన్న హిమ.. ఆ మాటలు విని.. ‘దీపా? వంటలక్క పేరు దీపా? మా అమ్మ పేరు వంటలక్క పేరు ఒక్కటేనా? ఇన్ని రోజులు నాకు ఎవరూ చెప్పలేదేంటీ?’ అనుకుంటూ ఆలోచించుకుంటూ బయటికి నడుస్తుంది. ఓ చోట నిలబడి ఆలోచిస్తుంది.

నీకో విషయం తెలుసా?

రిజ్వానా దీపని అన్న మాటలు, దీప ఎవరు అంటే.. సౌందర్య, ఆనందరావులు మాట్లాడకుండా ఉండిపోవడం.. అంతా గుర్తు చేసుకుని సౌర్య కోపంతో రగిలిపోతుంది. అదే కోపంలో కాళ్ల దగ్గర ఉన్న ఓ బాటిల్‌ని ఆవేశంగా తన్నుతుంది సౌర్య. అది వెళ్లి హిమ కాలికి తగులుతుంది. ఒకరినొకరు చూసుకుంటారు. వెంటనే హిమ సౌర్య దగ్గరకు వచ్చి.. ‘నీకో విషయం తెలుసా? వంటలక్క పేరు దీప అట కదా?’ అంటుంది అమాయకంగా. ‘మా అమ్మ పేరు నాకే చెబుతావా? అవును.. మా అమ్మ పేరు దీపే. కానీ మా అమ్మ ఎవరికీ తెలియదు’ అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

ఆ మౌనిత నా డెలివరీ టైమ్‌లో కూడా..

దీప బాధగా మెట్ల మీద కూర్చుంటే.. సౌందర్య వచ్చి.. ‘ఎందుకు ఇందాక అలా మాట్లాడావ్?’ అంటుంది. ‘ఆ మౌనిత నా డెలివరీ టైమ్‌లో కూడా అలానే చేసింది అత్తయ్యా’ అంటుంది దీప సౌందర్యతో.. ఇంతలో కార్తీక్ ‘చాల్లే ఆపు’ అంటూ ఆవేశంగా వచ్చి… మళ్లీ దీపను తిడుతుంటాడు. కావలనే మౌనితని బ్యాడ్ చెయ్యాలని చూస్తున్నారని రగిలిపోతాడు. ఇంతలో ఆనందరావు వచ్చి ‘ఆపు కార్తీక్ ఎప్పుడూ దీపని తిడ్డటమే పనా?’ అంటూ కోప్పడతాడు.

వారసుడు పుట్టాడు..

ఇంతలో లోపల నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించడంతో అంతా సంతోషిస్తారు. మౌనిత బయటికి వచ్చి.. ‘నా చేతుల్లో ఉన్నంత వరకూ ట్రై చేశాను. ఆదిత్యా నీకు కొడుకు పుట్టాడు’ అంటూ కంగ్రాట్స్ చెబుతుంది. దీప మౌనితని శ్రావ్య బాగానే ఉందా అని అడగడంతో..‘నా అదృష్టం కొద్ది బతికే ఉంది’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

పెద్దమ్మా? ఎలా పెద్దమ్మా అవుతుంది?

భాగ్యం అయితే మురళీ కృష్ణని పట్టుకుని.. ‘మనకి మనవడు పుట్టాడయ్యా’ అంటూ ఎగురుతుంది. అంతా కలిసి లోపలికి వెళ్లి శ్రావ్యకు కంగ్రాట్స్ చెప్పి.. బాబుని చూస్తారు. ‘నాలానే అందంగా పుట్టాడు.. నా మనవడు’ అంటూ భాగ్యం చేస్తుంటే.. ‘ఎవరోచ్చారో చూడూ మీ పెద్దమ్మ వచ్చింది’ అంటూ మురళీ కృష్ణ అన్న మాటలు అప్పుడే డోర్ తీసిన సౌర్య వింటుంది. ‘పెద్దమ్మా? ఓ ఆదిత్య బాబాయ్‌కి అమ్మ వదిన అవుతుందిగా అందుకే అలా అనుంటారు’ అనుకుని మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది.

సౌర్య వెటకారం..

సీన్ కట్ చేస్తే.. దీప, సౌందర్య, ఆనందరావులు హాస్పిటల్‌లో ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ‘హిమ ఏది అత్తయ్యా?’ అంటుంది దీప. ‘వాళ్ల నాన్నతో కలిసి వెళ్లిపోయిందమ్మా’ అంటాడు ఆనందరావు. అప్పుడు వారణాసిని వెంట పెట్టుకుని వచ్చిన సౌర్య.. ఆ మాటలు విని…. ‘హా అవును.. మీ మనవరాలు.. వాళ్ల నాన్నతో వెళ్లిపోయింది కదా?’ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ‘ఏమైంది దీనికి ఇలా మాట్లాడుతుంది?’ అంటాడు ఆనందరావు.

సౌందర్య ఆనందరావులు షాక్..

దీపని చూస్తూ.. ‘అమ్మా వెళ్దామా?’ అంటుంది సౌర్య. ‘అమ్మా… వెళ్దామా?’ మరో సారి రెట్టిస్తుంది. ‘ఏమైంది అత్తమ్మా?’ అంటూ దీప అనగానే.. ‘అత్తమ్మా అని నువ్వు పుట్టినట్లే.. ఈ మేడమ్(సౌందర్య) నీ అత్తగారినని ఎందుకు చెప్పలేదు? అంటూ మొదలుపెట్టి.. రక్తం అమ్ముకున్నావా? అమ్మా ఎంత డబ్బులు వచ్చాయి? అసలు..? నువ్వు ఎవరు అని అడిగితే వీళ్లంతా నోరు మెదపలేదేంటమ్మా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలతో కోపంగా రగిలిపోతుంది సౌర్య.

కమింగ్ అప్‌లో..

హిమ, కార్తీక్‌లు కారులో వెళ్తూ ఉంటారు. కార్తీక్ కోపంతో ఏదో ఆలోచిస్తూ ఉంటే.. హిమ ‘డాడీ.. డాడీ’ అని పిలుస్తుంది. ‘ఏటమ్మా?’ అంటాడు కార్తీక్. ‘మరి నీకో విషయం తెలుసా? మన వంటలక్క పేరు కూడా దీపేనట’ అంటుంది హిమ కార్తీక్‌తో.. వెంటనే కారుకి సడన్ బ్రేక్ కొడతాడు కార్తీక్. మొత్తానికి ఇటు హిమ, అటు సౌర్యలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో కథ ఆసక్తిగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.