
కిషోర్ కుమార్ పార్థసాని అలియాస్ డాలీ.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలున్నాయి. కానీ ఆ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది.
దీని తర్వాత అనుకోకుండా వరుసగా మూడు రీమేక్ సినిమాలు (తడాఖా, గోపాల గోపాల, కాటమరాయుడు) చేశాడు డాలీ. దీంతో అతడిపై రీమేక్ డైరెక్టర్ అన్న ముద్ర పడిపోయింది. దీంతో ఇకపై రీమేక్‌లే చేయొద్దని డిసైడైపోయాడు డాలీ. తన తర్వాతి సినిమా ఒరిజినలే ఉంటుందని అతను స్పష్టం చేశాడు.
‘‘ఈ రోజుల్లో స్ట్రెయిట్ సినిమా సినిమా తీసినా… హాలీవుడ్ సినిమా నుంచో లేదా ఎక్కడో ఒక చోటు నుంచో కొందరు స్ఫూర్తి పొందుతారు. రీమేక్ సినిమా కూడా అంతే. మక్కీకి మక్కీ దించేయడం నాకిష్టం లేదు. రీమేక్ చేస్తున్నా ఒరిజినల్ లోని కథ తీసుకుని కొత్తగా స్క్రిప్టు రాస్తాను.
‘కాటమరాయుడు’ సినిమాలో ఫస్టాఫ్ చాలా వరకు మార్చేశా. ఇప్పటికే మూడు రీమేక్‌లు చేశా. ఇకపై రీమేక్స్ చేయాలనుకోవడం లేదు. నా తర్వాతి మూవీ నా సొంత కథతోనే ఉంటుంది’’అని డాలీ తెలిపాడు. పవన్ కళ్యాణ్‌తో ఒకటికి రెండు సినిమాలు చేయడం సంతోషమే అని.. ఆయనతో మళ్లీ పని చేయాలనుందని.. ఈసారి స్ట్రెయిట్ సినిమా చేయాలన్నది తన కోరిక అని డాలీ అన్నాడు.
Recent Random Post:

















