
కృష్ణవంశీది భిన్నమైన వ్యక్తిత్వం. ఆయన హీరోల్ని పొగడ్డం అరుదు. ఐతే ఈ మధ్య ఆయన తీరు మారుతున్నట్లుంది. వరుస ఫెయిల్యూర్లతో కొట్టుమిట్టాడుతున్న తనకు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌లను ఓ రేంజిలో పొగిడేస్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు.
తాజాగా ‘రైతు’ సినిమాకు అవకాశం ఇచ్చేలా ఉన్న నందమూరి బాలకృష్ణను కూడా అలాగే పొగిడేశాడు కృష్ణవంశీ. బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాలయ్యకు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఫేస్ బుక్‌లో ఒక లెంగ్తీ మెసేజ్ పెట్టాడు కృష్ణవంశీ.
నందమూరి బాలకృష్ణ స్క్రీన్ మీదా.. బయటా ఒక అగ్నిపర్వతం లాంటి వాడంటూ మొదలుపెట్టిన కృష్ణవంశీ.. ఎలాంటి పాత్రనైనా, ఎలాంటి సినిమా అయినా చేయగల ఏకైక నటుడు బాలయ్యే అన్నాడు. ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ సుదీర్ఘ కాలంగా వెండితెరను వర్ణరంజితం చేస్తున్నాడంటూ బాలయ్యకు కితాబిచ్చాడు వంశీ.
2000 ఏళ్ల కిందటి నేపథ్యంలో ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రజల్ని పలకరించడానికి బాలయ్య వస్తున్నాడని అన్నాడు. క్రిష్ దర్శకత్వ ప్రమాణాలకు.. అతడి విలువలకు అభినందనలు తెలిపిన కృష్ణవంశీ.. ఈ సినిమా పెద్ద హిట్టయి ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్గా నిలవాలని ఆకాంక్షించాడు కృష్ణవంశీ. ‘బాహుబలి’ లాంటి సినిమాల విషయంలో స్పందించని కృష్ణవంశీ ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విషయంలో ఇలా స్పందించాంటే.. అందుకు బాలయ్య ఆయన అవకాశమివ్వబోతుండటమే కారణం అనుకోవాలేమో.
Recent Random Post: