
మెగాస్టార్ తదుపరి చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేయవచ్చునంటూ వార్తలొచ్చాయి. మెగాస్టార్తో సినిమా చేయబోతున్నానంటూ క్రిష్ కూడా చూచాయగా చెప్పాడు. గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకి ముందు క్రిష్ పేరుని సీరియస్గా కన్సిడర్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు వేరే ఆప్షన్స్ మీద దృష్టి పెట్టాడేమో అనిపిస్తోంది.
గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ దర్శకుడిగా ఈ చిత్రానికి క్రిష్ అందుకుంటోన్న క్రెడిట్ తక్కువేనని చెప్పాలి. చారిత్రిక కథాంశం, బాలకృష్ణ అభినయం ఈ చిత్రానికి ప్రధాన బలాలయ్యాయి. మంచి కథాంశాన్ని ఎంచుకున్న క్రిష్ చరిత్రని తెరకెక్కించే విషయంలో పూర్తి హోమ్వర్క్ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. తన తదుపరి చిత్రం వెంకటేష్తో చేయడానికి క్రిష్ సిద్ధమవుతున్నాడు.
బాలయ్య వందవ చిత్రం తర్వాత వెంకీ 75వ చిత్రం క్రిష్ చేతికి వచ్చింది. తన కంఫర్ట్కి అనుగుణంగా, స్వీయ నిర్మాణంలోనే సినిమాలు తీసే క్రిష్ బహుశా వేరే బ్యానర్లో చేయడానికి సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. మెగాస్టార్తో సినిమా అంటే ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ దాటి బయటకి వచ్చే ఛాన్సులు బహు అరుదు. ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడానికి ఇది కూడా కారణమై ఉండొచ్చు.
Recent Random Post: