
సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీ రాయ్. అందాల ప్రదర్శనకు ఏ రోజూ అడ్డు చెప్పకపోయినా ఆమె ఆశించిన అవకాశాలు అందుకోలేదు. తనకు సరైన బ్రేక్ రాలేదు. అటు తమిళంలో.. ఇటు తెలుగులో చేసిన గ్లామర్ షో సరిపోలేదని.. కొత్తగా బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టేసింది రాయ్ లక్ష్మీ. ఐతే అక్కడ ఆమె చేస్తోంది మామూలు సినిమా కాదు.
పుష్కరం కిందట కుర్రాళ్లలో సెగలు రేపిన ‘జూలీ’ సినిమాకు సీక్వెల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది రాయ్ లక్ష్మీ. అప్పట్లో నేహా ధూపియా ‘జూలీ’ పాత్రలో రెచ్చిపోతే.. ఇప్పుడు రాయ్ లక్ష్మీ ఆమెను మరిపించే ప్రయత్నంలో ఉంది. సౌత్‌లో ఎలా అందాలు ఆరబోసినా.. బాలీవుడ్లోకి వెళ్లాక ఆ మేకోవర్ వేరుగా ఉంటుందని ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన రాయ్ లక్ష్మీ ఫొటో చాటిచెబుతోంది.
బికినీలో రాయ్ లక్ష్మీ అందాల విందు చేస్తున్న ఫొటో ఇది. ఇందులో ఆమెను చూసి షాకైపోవాల్సిందే. సన్నబడి నాజూగ్గా తయారైన రాయ్ సరికొత్తగా దర్శనమిస్తోంది. ఆమె బాడీలో బాలీవుడ్ టచ్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలోనూ రాయ్ లక్ష్మీ సరికొత్తగా దర్శనమిస్తుందని ఈ ఫొటోను బట్టి తెలుస్తోంది.
Recent Random Post: