మణిరత్నంకు ఊహించని తలపోటు..

అసలే ‘చెలియా’ సినిమా డిజాస్టర్ అయిందన్న నైరాశ్యంలో ఉన్నాడు దర్శకుడు మణిరత్నం. ఇలాంటి టైంలో ఆయనకు ఊహించని తలనొప్పి మొదలైంది. మణిమారన్ అనే లైట్ మన్ ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్నాడు. అతను పదేళ్ల కిందట మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గురు’ సినిమాకు పని చేశాడు.

ఐతే ఆ సినిమాకు పని చేస్తున్న సమయంలోనే అతడికి రక్త సంబంధిత వ్యాధి సోకింది. ఆ సినిమా మణిరత్నం సొంత బేనర్లో తెరకెక్కిందని.. ఐతే ఆ సంస్థ నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని మణిమారన్ ఆరోపిస్తున్నాడు. అలాగే లైట్ మన్ అసోసియేషన్ నుంచి కూడా మణిమారన్‌కు ఎలాంటి సాయం అందలేదట. చికిత్సకు.. మందులకు చాలా ఖర్చవుతోందని.. కానీ తనను ఎవ్వరూ ఆదుకోలేదని అతను ఆరోపిస్తున్నాడు.

మణిమారన్ లైట్ మన్ అసోసియేషన్ మీద కోర్టులో పోరాడాడు కూడా. ఈ కేసులో అతనే గెలిచాడు. లైట్ మన్ అసోసియేషన్‌ రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఐతే ఆ డబ్బులు తనకివ్వడానికి లంచం అడుగుతున్నారని.. మరోవైపు మణిరత్నం నుంచి తనకు రూపాయి కూడా సాయం అందలేదని ఆరోపిస్తూ అతను మణిరత్నం ఇంటిముందు ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరిస్తున్నాడు. నిరసన ప్రదర్శనకు రెడీ అవుతున్నాడు. ఈ విషయమై అతను ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. వివాదాలకు దూరంగా ఉండే మణిరత్నంకు ఇది అనవసర తలనొప్పిగా మారింది.


Recent Random Post: