
గతంలో మాదిరి పరిస్థితి లేదు. సినిమాకు కాబ్బరికాయ కొట్టక ముందే.. సినిమా పేరును లాంఛనంగా ప్రకటించటమే కాదు.. షూటింగ్ షురూ అయ్యే నాటికే ఎంత క్రేజ్ తీసుకురావాలో అంత క్రేజ్ తీసుకొచ్చేస్తున్న రోజులివి. మరి.. ఇలాంటి రోజుల్లో షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి అవుతున్నప్పటికీ.. పేరును డిసైడ్ చేయని పరిస్థితి. మహేశ్ లాంటి స్టార్ హీరో మూవీకి టైటిల్ ఇంకా ఫిక్స్ కాకపోవటం ఫ్యాన్స్ విపరీతమైన నిరాశలో ఉంటున్నారు.
అప్పుడు ప్రకటిస్తారు.. ఇప్పుడు ప్రకటిస్తారంటూ ఆశగా ఎదురుచూస్తున్నా.. ఎప్పటికప్పడు నిరాశే మిగిలే పరిస్థితి.మురగదాస్ దర్వకత్వంలో వస్తున్న ఈ మూవీ మీద అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. మరో నెలన్నర వ్యవధిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేయాలని అనుకుంటున్నా.. ఇంకా సినిమా టైటిల్ ను మాత్రం ఫిక్స్ చేయలేదు.
ఏజెంట్ శివ.. సంభవామి అంటూరెండు టైటిల్స్ గాలికి తిరుగుతూ అందరి నోళ్లల్లో నానినా.. ఆ రెండింటిపైనా చిత్ర యూనిట్ కు ఇంట్రస్ట్ లేదన్నమాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. మరో నాలుగు రోజుల్లో సినిమా పేరును రివీల్ చేసేస్తారని చెబుతున్నారు.ఉగాది పండక్కి చిత్రం ఫస్ట్ లుక్ ను తీసుకురావాలని భావిస్తున్న చిత్రబృందం.. అదే రోజు పేరును ప్రకటిస్తారని చెబుతున్నారు. ప్రిన్స్ మూవీకి తాజాగా వినిపిస్తున్న పేరు.. స్పైడర్. ఇందులో నిజం మాట ఎంతన్నది తేలాలంటే.. ఉగాది వరకూ వెయిట్ చేస్తే సరిపోతుంది.
Recent Random Post: