
మెగా ఫ్యామిలీతో మహేష్‌బాబు అనుబంధం నానాటికీ బలపడుతోన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే మహేష్ ఫ్యామిలీ, చరణ్ ఫ్యామిలీ కలిసి విదేశీ టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్, చరణ్ కలిసి కనిపించిన ఫోటోలు ఇరు వర్గాల అభిమానుల్ని ఆశ్చర్యపరిచాయి, ఆనంద పెట్టాయి.
ప్రస్తుతం మహేష్ ఇంట్లో ఏ పార్టీ జరిగినా అక్కడికి చరణ్ దంపతులు రావాల్సిందే, అలాగే ఇటు పక్క ఏం జరిగినా వాళ్లకీ ఆహ్వానం వెళ్లాల్సిందే. మహేష్, చరణ్ క్లోజ్‌నెస్‌కి తోడు తాజాగా మహేష్ సినిమా సెట్స్‌లో చిరంజీవి సందడి చేసేసరికి ఈ బంధం దృఢమైనదేనని అభిమానులు ఆనందిస్తున్నారు. చిరంజీవితో మహేష్‌కి ఎప్పుడూ సఖ్యత ఉన్నప్పటికీ వాళ్ల ఫ్యామిలీతో ఇంత క్లోజ్‌గా ఉండడం ఎప్పుడూ కనిపించలేదు.
ఆ మాటకి వస్తే మహేష్ అసలు తన కుటుంబంతో తప్ప ఇతర హీరోలతో అంతగా సోషలైజ్ అవడు. ఏదేమైనా టాప్ హీరోలు తరచుగా కలిసి కనిపించడం అభిమానుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తుంది. ఎప్పుడూ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ కొట్టుకునే వారు కాస్తా హీరోల మధ్య సఖ్యత చూసి తమ పద్ధతి మార్చుకునే అవకాశముంటుంది.
Recent Random Post: