ఫస్ట్ లుక్ డేట్ మహేషే చెప్పాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా తొలి చూపు కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా ఒక కొత్త సినిమా మొదలైన రెండు మూడు నెలలకే ఫస్ట్ లుక్ లాంచ్ చేసేస్తుంటారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా మొదలై ఎనిమిది నెలలు దాటుతున్నా.. ఇప్పటిదాకా దానికి సంబంధించిన ఏ విశేషాన్నీ బయటపెట్టలేదు.

కనీసం టైటిల్ కూడా ప్రకటించలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఫస్ట్ లుక్.. టీజర్ ఎప్పుడు రిలీజవుతాయో చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త డేట్ చెబుతున్నారు. ఆ డేట్ వచ్చే సమయానికి నిరాశలోకి నెడుతున్నారు. మార్చి 9న పక్కా అంటే పక్కా అన్నారు కానీ.. ఆ రోజు ఏ విశేషం బయటికి రాలేదు.

ఐతే మార్చి 29న ఉగాది కానుకగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు మహేష్ బాబే స్వయంగా చెప్పడం విశేషం. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌కు తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఫస్ట్ లుక్ ఎప్పుడు అనే ప్రశ్న కూడా ఉంది. దానికి బదులిస్తూ ఉగాది రోజుకు ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు మహేష్. స్వయంగా హీరోనే డేట్ చెబుతున్నాడు కాబట్టి ఇది పక్కా అనుకోవచ్చు. జూన్ 23కు సినిమా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఇక ఫస్ట్ లుక్ లాంచ్ చేసి ప్రమోషన్ జోరు పెంచకుండా అనుకున్నట్లుగా హైప్ రాదు.


Recent Random Post: