తేజ్‌ పుట్టిన రోజున ఛాలెంజ్‌ విసిరిన మంచు హీరో

నేడు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రముఖులు ముఖ్యంగా యంగ్‌ హీరోలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నటిస్తున్న సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాకు సంబంధించిన పాటతో పాటు ఇతర సినిమాల అప్‌ డేట్స్‌ ను కూడా విడుదల చేశారు. ఈ సమయంలోనే మంచు మనోజ్‌ చేసిన ఒక ట్వీట్‌ ఒక్కసారిగా అందరి అటెన్షన్‌ ను దక్కించుకుంది. ఆ ట్వీట్‌ లో సాయి ధరమ్‌ తేజ్‌ ను ఛాలెంజ్‌ చేశాడు. 38 ఏళ్ల క్రితం వచ్చిన మల్టీ స్టారర్‌ సినిమా చేసేందుకు నేను రెడీ నువ్వు రెడీనా అంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆసక్తిని పెంచింది.

ఇంతకు మనోజ్‌ చేసిన ఆ ట్వీట్‌ ఏంటీ అంటే.. హ్యాపీ బర్త్‌ డే సాయి ధరమ్‌ తేజ్‌ అంటూ 38 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదల అయిన బిల్లా రంగా సినిమా పోస్టర్‌ ను మనోజ్‌ షేర్‌ చేశాడు. బిల్లా రంగా 38 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్బంగా రీమేక్‌ కు నేను రెడీ నువ్వు రెడీనా అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ కు మంచు మనోజ్‌ ఛాలెంజ్‌ చేశాడు. చిరంజీవి మరియు మోహన్‌ బాబు కలిసి నటించిన సూపర్‌ హిట్‌ మల్టీస్టారర్‌. అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమాను వీరిద్దరు రీమేక్‌ చేస్తే అది ఖచ్చితంగా సంచలనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిల్లా రంగాకు మనోజ్‌ రెడీగా ఉన్నాడు మరి తేజ్‌ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మల్టీస్టారర్‌ సినిమాలకు ఈమద్య కాలంలో మంచి ఆధరణ ఉంటుంది. యంగ్‌ హీరోలు సైతం మల్టీ స్టారర్‌ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. వీరిద్దరి మద్య మంచి స్నేహం ఉంది. కనుక ఖచ్చితంగా వీరిద్దరు చేస్తే ఒక మంచి సినిమా అవ్వడంతో పాటు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కూడా అందించడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయ్యింది. కమర్షియల్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఆమద్య వరుసగా ఆరు ఫ్లాప్ లు పడ్డాయి. ఇక ఆయన కెరీర్‌ ఖతం అనుకుంటున్న సమయంలో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సక్సెస్ లు దక్కాయి. ఇప్పుడు సోలో బ్రతుకే సోబెటర్‌ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందనిపిస్తుంది. నేడు తేజు పుట్టిన రోజు సందర్బంగా ఆయన ముందు ముందు మరిన్ని మంచి సినిమాల్లో నటించి మామకు తగ్గ అల్లుడని.. సుప్రీం హీరో పేరుకు తగ్గవానిగా నిరూపించుకోవాలని కోరుకుంటూ హ్యాపీబర్త్‌డే తేజూ.