
హీరో కాక ముందునుంచీ వరుణ్ తేజ్ సక్సెస్ అవుతాడనేది మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా అతడిని చూసిన వారంతా ఫీలయ్యారు. హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ వున్న వరుణ్ తేజ్ ఇంతవరకు కెరియర్ పరంగా తీసుకున్న డెసిషన్స్‌ని కూడా తప్పుబట్టలేం. ఇంతవరకు అతను చేసిన చిత్రాలన్నీ పేరున్న, హిట్లిచ్చిన దర్శకులతోనే చేసాడు. అయితే కాలం కలిసి రాక ఏదీ క్లిక్ అవలేదు.
మొదటిసారిగా ‘ఫిదా’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. సాయి పల్లవి డామినేట్ చేసినా కానీ వరుణ్ షేర్ వరుణ్‌కి వచ్చేస్తోంది. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి ఫాలోయింగ్ పెరుగుతోంది. వరుణ్‌తో ఒక పక్కా మాస్ సినిమా చేయించాలని చిరంజీవి ఎప్పుడో చెప్పినప్పటికీ అతనికి హిట్ వచ్చే వరకు వేచి చూసి తర్వాత అలాంటి అటెంప్ట్ చేయాలని ఆగారు. ఫిదాతో వరుణ్‌కి పెద్ద హిట్ పడడంతో ఇప్పుడు మాస్ సినిమా కోసం వేట మొదలు పెట్టారు.
టాప్ డైరెక్టర్లయిన వినాయక్, బోయపాటి శ్రీను లాంటి వాళ్లతో వరుణ్‌కి సినిమా సెట్ చేస్తే మాస్‌లోకి దూసుకెళ్లిపోతాడని అనుకుంటున్నారు. వీరు కాకుండా తమిళంలో పేరున్న మాస్ దర్శకులని కూడా కన్సిడర్ చేస్తున్నారు. అయితే ఈలోగా వరుణ్ తేజ్ మొదటి సారిగా ఒక కొత్త దర్శకుడితో ప్రయోగానికి దిగుతున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందే ఈ చిత్రం కూడా వరుణ్‌ని యూత్‌కి, క్లాస్‌కి దగ్గర చేసేలానే వుంటుందట. దీని తర్వాత వరుణ్‌తో ఫక్తు మాస్ మసాలా సినిమా ఒకటి వుంటుందని సమాచారం.
Recent Random Post: