
అన్నయ్య రీఎంట్రీ విషయంలో పవన్‌కళ్యాణ్ తీరు పట్ల మెగా అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆ చిత్రం గుంటూరు బహిరంగ వేడుకకి వెళ్లకుండా హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్ కనీసం సినిమా చూసి తన తరఫునుంచి అన్నయ్యకి శుభాకాంక్షలు స్వయంగా చెప్పలేదు. ట్విట్టర్ ద్వారానో లేదా కనీసం తాను విడుదల చేసే ప్రెస్‌నోట్స్ ద్వారానో పవన్ తన అనుభూతిని పంచుకుని ఉండవచ్చునని, తన ప్రతినిధి ద్వారా ట్వీట్ చేయించడం ఏంటని అభిమానులు మండి పడుతున్నారు. మహేష్‌లాంటి హీరోకి అసలు చిరంజీవి చిత్రం గురించి ట్వీట్ చేయాల్సిన అవసరమే లేదని, కానీ చిరుపై గౌరవం కొద్దీ తను దాని గురించి గొప్పగా మాట్లాడాడని, కనీసం ఆ గౌరవాన్ని అయినా అన్నయ్యకి పవన్ ఇవ్వలేకపోవడం ఏమిటని మెగా ఫాన్స్ పవర్‌స్టార్‌ని తిట్టుకుంటున్నారు.
అన్నయ్య సినిమాకి తనవంతు తోడ్పాటుగా ప్రచార కార్యక్రమాల్లో ఒక్కటైనా చేసి ఉండవచ్చునని, అంత పెద్ద మనసు లేనప్పుడు కనీసం డైరెక్టుగా చిరంజీవిని అభినందిస్తూ ట్వీట్స్ చేయడమో లేదా, మరో విధంగానో తన ఫీలింగ్స్ షేర్ చేసుకుని వుండవచ్చునని అంటున్నారు. ఇటీవలే దంగల్ చిత్రం గురించి అన్ని ట్వీట్లు వేసిన పవన్‌కి అన్నయ్య సినిమా మీద కనీసం ఆపాటి మర్యాద, మన్ననలు లేవా అంటూ గళమెత్తుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో పవన్ తన లాయల్ ఫాన్స్‌లో కొందరి ఆగ్రహాన్ని సైతం చవిచూసాడు. ఫాన్స్‌కి మళ్లీ తిరిగి ఉత్సాహాన్ని ఎలా తెస్తాడో, వారినెలా మెప్పిస్తాడో చూద్దాం.
Recent Random Post: