
వయసు మీద పడుతున్నా.. పెళ్లి ఊసు ఎత్తకుండా తన పని తాను చేసుకుంటూ పోయే టాలీవుడ్ హీమ్యాన్ ప్రభాస్ గా చెప్పాలి. బాహుబలి చిత్రంతో ఆయనచరిత్రే సృష్టించారు. టాలీవుడ్ లో హీరోలు చాలామందే ఉన్నా.. ఈ డార్లింగ్ కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఒక సినిమాకు మూడేళ్లు టైం ఇచ్చే మొనగాడిగా మొన్నటి వరకూ ఇండస్ట్రీ కీర్తించిన ప్రభాస్ కు ఇప్పుడు 38 ఏళ్లు. వయసు మీదకు వచ్చేస్తున్న పెళ్లి గురించి అస్సలు ప్రస్తావించని ఇతగాడి మ్యారేజ్ డిటైల్స్ ను చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.
ఈ మధ్యనే బాహుబలి 2 షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్.. తర్వాత సుజిత్ సినిమాకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ మధ్యలోనే డార్లింగ్ పెళ్లి ఉంటుందని చెబుతున్నారు. బాహుబలి సినిమా విడుదల తర్వాత సుజిత్ సినిమా ప్రారంభానికి ముందు పెళ్లి జరుగుతుందన్న మాట కృష్ణం రాజు నోటి నుంచి వచ్చింది. అయితే.. పెళ్లికూతురి డిటైల్స్ ను మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఇప్పటివరకూ ఇండస్ట్రీలో అనుకుంటున్న మాటల ప్రకారం.. ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. ఆ అమ్మాయిది గోదావరి జిల్లాలకు చెందిందని చెబుతున్నారు. ప్రభాస్ తల్లిదండ్రులు డార్లింగ్ కు వధువును సెలెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి వివరాలు మరింత వివరంగా తెలియాలంటే మాత్రం.. బాహుబలి 2 రిలీజ్ అయ్యే వరకూ ఆగితే సరిపోతుందంటున్నారు. ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నఅభిమానులు ఈ కొద్దికాలం వెయిట్ చేయకుండా ఉంటారా?
Recent Random Post: