అన్నయ్య పెదరాయుడిలా తీర్పు చెప్పాలని అనుకోలేదు: నాగబాబు హాట్ కామెంట్స్

టాలీవుడ్ సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని అన్నయ్య చిరంజీవి ఎప్పుడూ అనుకోలేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తన చేతనైనంత సహాయం చేయాలని చూస్తారే కానీ.. ‘పెదరాయుడు’లాగా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలయిస్తారని అనుకోలేనది మెగా బ్రదర్ క్లారిటీ ఇచ్చారు.

మా సభ్యత్వానికి రాజీనామ ాచేసిన నాగబాబు తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.మా అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఈ ఫలితాల్లో విష్ణు గెలిచాక ఇంక సినీ ప్రముఖులు గొడవలకు దిగుతున్నారు. మాది సినిమా కుటుంబం.. అందరం ఒక్కటేనన్న ప్రకాష్ రాజ్ వర్గం తిరుగుబావుటా ఎగురవేసింది. అందరికంటే ముందు తిరుగుబాటు చేసింది నాగబాబే.. అసోసియేషన్ సభ్యత్వంలో అక్రమాలు జరిగాయని.. అన్యాయంగా గెలిచారని.. ఇలాంటి సంకుచిత రాజకీయంలో తాను ఉండనని ఆయన రాజీనామా చేసేశారు.

ఈ క్రమంలోనే ఓ మీడియా చానెల్ తో మాట్లాడారు. ప్రాంతీయవాదం కులంతోపాటు ప్రకాష్ రాజ్ వృత్తిపరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చారని.. ఇబ్బంది కలిగేలా ప్రత్యర్థి ప్యానల్ సభ్యులు కామెంట్ చేసిన క్రమంలో అతడికి సపోర్టుగా తాను వారికి కౌంటర్ ఇచ్చానని నాగబాబు తెలిపారు.

తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని.. విశాల హృదయంతో వ్యవహరిస్తారని అనుకుంటే.. వేరే విధంగా ఉందని నాగబాబు తెలిపారు. ఎన్నికల అనంతరం ఇలాంటి సంకుచిత అసోసియేషన్ లో ఉండాలని అనిపించలేదని.. మనస్థాపంతోనే తాను బయటకు వచ్చేశానని తెలిపారు.

అన్నయ్యచిరంజీవి ఎప్పూడ ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని అనుకోలేదని.. పరిశ్రమలో ఉన్న వారు.. ఇతరులు అభిమానులు ఎవరైనా సరే కష్టమంటూ ఇంటికి వస్తే చేతనైంత సాయం చేశారని తెలిపారు. చిరంజీవి అహంకారం లేదని పరోక్షంగా మోహన్ బాబుపై నాగబాబు విమర్శలు గుప్పించారు.