అన్నయ్య ఎప్పుడూ అలా అనుకోలేదు – నాగబాబు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగి ఫలితాలు కూడా బయటకు వచ్చాయి. అయినా దాని తాలూకా వేడి ఇంకా తగ్గలేదు. ఫలితాల అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

అనంతరం ఈ వ్యవహారంపై మరోసారి వ్యాఖ్యానించాడు నాగబాబు. సంకుచిత భావాలున్న ఈ అసోసియేషన్ లో ఇకపై తాను కొనసాగాలి అనుకోవడం లేదని అన్నాడు. సాధారణ ఎన్నికలలో జరిగే అక్రమాలు, అన్యాయాలు ఈ చిన్న మా అసోసియేషన్ లో జరగడం దారుణమన్నాడు.

ఇకపై మా తో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన నాగబాబు కష్టమంటూ ఎవరైనా ఇంటికి వస్తే చిరంజీవి సహాయం చేశారే తప్ప ఇండస్ట్రీ పెద్ద అన్న సింహాసనం అన్నయ్యకు అవసరం లేదని నాగబాబు అన్నాడు. అన్నయ్యకు అంత అహంకారం లేదు అని నాగబాబు వ్యాఖ్యానించాడు.