బిగ్ బాస్ 5పై లేటెస్ట్ అప్డేట్ ఇదే!!

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు గాంచిన బిగ్ బాస్ నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఒక సీజన్ ను మించి మరో సీజన్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఐదో సీజన్ పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నాలుగో సీజన్ కోవిద్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ లో మొదలైన ఈ షో డిసెంబర్ వరకూ సాగింది.

అయితే ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను నిర్వహిద్దాం అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు కానీ అది సాధ్యపడలేదు. కోవిద్ సెకండ్ వేవ్ కారణంగా అన్ని ప్లాన్స్ మటాష్ అయ్యాయి. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వహణ ప్లాన్స్ ను వెనక్కి తోసేశారు. ఇప్పట్లో ఈ షో ఉండకపోవచ్చు. ఆగస్ట్ నుండి మొదలుపెట్టే సూచనలు ఉన్నాయి. నాగార్జున హోస్ట్ గా కొనసాగుతారు.