స్టార్‌ డైరెక్టర్లు పట్టించుకోని హిట్‌ హీరో

ఇండస్ట్రీ కేవలం కొన్ని ఫ్యామిలీస్‌కి మాత్రమే చెందినది కాదని అంటూ వుంటారు. టాలెంట్‌ వున్న ఎవరైనా వచ్చి ఇక్కడ అందలం ఎక్కవచ్చని చెప్తుంటారు. అయితే ఎంత టాలెంట్‌ వున్నా, ఎంతగా సక్సెస్‌ అయినా కానీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని హీరోల వైపు వెళ్లడానికి స్టార్‌ డైరెక్టర్లు ముందుకు రారు.

డైరెక్టర్లు తలచుకుంటే ఏ హీరో రేంజ్‌ని అయినా పెంచగలరు. కానీ డైరెక్టర్లందరూ కొందరు బడా హీరోలకే పరిమితం అవుతున్నారు. నానినే తీసుకుంటే స్వయంకృషితో, మంచి కథల ఎంపికతో, ప్రతిభతో జనాన్ని మెప్పించి ముప్పయ్‌ కోట్ల మార్కెట్‌ వున్న హీరోగా ఎదిగాడు. అతడిలాంటి హీరోకి బడా డైరెక్టర్‌ జత కలిస్తే యాభై కోట్ల మార్కెట్‌ రావడం అంత కష్టమేం కాదు. అయితే అతడితో చేయాలని దర్శకులు పూనుకోవాలి. ఎందుకంటే నానిని ఇంకా పెద్ద స్టార్‌ని చేద్దామంటూ ఏ నిర్మాత అతడికి పనిగట్టుకుని ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ సెట్‌ చేయాలనుకోడు.

నాని అయితే తనకోసం స్టార్‌ డైరెక్టర్లు రావడం లేదని చింతించడం లేదు. తనకి నచ్చిన కథలు చేసుకుంటూ వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. అయితే ఎంతసేపు కోట్లు కుమ్మరించే హీరోల కోసం వెళుతూ, టాలెంట్‌ ఉన్న వాళ్లని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమనేది డైరెక్టర్లు ఆలోచించుకోవాలి.


Recent Random Post: