ఈసారేం కొంప ముంచుతారో..?

సాధారణంగా ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడుతున్నారంటే.. ఆ ఏముందిలే.. ఎప్పుడూ చెప్పే సుత్తేగా అనుకుంటాం. ఇప్పటిదాకా మన దేశంలో అదే జరిగింది కూడా. కానీ నవంబర్ 8న మోడీ మాట్లాడినప్పుడు అదే అనుకున్నవాళ్ళకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పుడు మళ్లీ ప్రధాని మాట్లాడతారన్న వార్త హల్చల్ చేస్తోంది.

ఇప్పటికే పెద్దనోట్లు రద్దు చేసి జనాల కొంప ముంచిన మోడీ.. ఈసారేం చేస్తారోనని అందరూ భయపడిపోతున్నారు. మోడీ చెప్పినట్లుగా నల్లధనవంతులకే నష్టం జరిగినా, సామాన్యులకు కూడా నోట్లు దొరక్క నానా కష్టాలు పడ్డారు. ఇప్పటికీ పరిస్థితి ఇంకా నార్మల్ కాలేదు.

ఇలాంటి సమయంలో డిసెంబర్ 31 రాత్రి మళ్లీ మోడీ మైకందుకుంటున్నారు. ఈసారి మోడీ దెబ్బకు న్యూఇయర్ పార్టీ చెడిపోతుందని యూత్ ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఇంకేం కొత్త నిర్ణయం ప్రకటిస్తారోనని అందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

అయితే సామాన్యులు అంత భయపడక్కర్లేదని వెంకయ్య చెబుతున్నారు. కొన్నాళ్లుగా శుభవార్త వింటారని ఊరిస్తున్నారు. మరి వెంకయ్య చెబుతున్నట్లు మోడీ ఈసారి శుభవార్త చెబుతారా.. లేదంటే నవంబర్ 8 నాటి కాళరాత్రిని మళ్లీ గుర్తుచేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.


Recent Random Post: