
రాశి ఖన్నా ప్రధానంగా గ్లామర్ పాత్రలు చేసినా కానీ తనలోని క్లాస్ యాంగిల్ ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలోనే చూసేసాం. ఆ తర్వాత తనలో మంచి కామెడీ నటి కూడా వుందని ‘సుప్రీమ్’ చిత్రంలో ‘బెల్లం శ్రీదేవి’ పాత్రలో చూపించింది. ఇక త్వరలో తనలోని విలన్ కోణాన్ని కూడా రాశి చూపించబోతోంది. మోహన్‌లాల్ హీరోగా ‘విలన్’ పేరుతో రూపొందుతోన్న చిత్రంలో రాశి ఖన్నా ఒక టఫ్ పోలీస్ పాత్రని చేస్తోంది.
స్వభావరీత్యా ఇది నెగెటివ్ క్యారెక్టర్ అని, చాలా ఛాలెంజింగ్‌గా వుంటుందని తెలిసింది. సుప్రీమ్‌లో పోలీస్ గెటప్‌లో రాశిని చూసి ఈ పాత్ర తనకి ఆఫర్ చేసారట. అప్పటికంటే ఇప్పుడు బాగా సన్నబడిన రాశి పోలీస్ పాత్రకి తగ్గట్టుగా నాజూగ్గా వుంది. ఒక హీరోయిన్‌కి ఇలాంటి పాత్ర రావడం చాలా అరుదు అని, తనకి కెరియర్ ఆరంభంలోనే ఇన్ని వైవిధ్యభరిత పాత్రలు చేసే అవకాశం రావడం అదృష్టమని ఆమె అంటోంది.
ఇక ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా నటిస్తోన్న రాశి ఈ చిత్రంతో టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతాననే నమ్మకంతో వుంది. ఎన్టీఆర్‌తో చేస్తే ఇక స్టార్ హీరోలంతా తనని సీరియస్‌గా కన్సిడర్ చేస్తారని ఆమె భావిస్తోంది.
Recent Random Post: